Komatireddy Venkat Reddy : కేసీఆర్ కు మతి భ్రమించింది
ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
Komatireddy Venkat Reddy : హైదరాబాద్ – రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న వేళ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. తాజాగా సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. దేశంలో జాతీయ పార్టీలకు సీన్ లేదని, రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలకే పవర్ లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. దీనిపై తీవ్రంగా స్పందించారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
Komatireddy Venkat Reddy Comments on KCR
సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ పై సెటైర్స్ వేశారు. టీఆర్ఎస్ పార్టీని భారత రాష్ట్ర సమితి పార్టీగా మార్చింది నువ్వే కదా , మరి అది నోరా లేక మోరీనా అని మండిపడ్డారు. ఓ వైపు తన పార్టీ జాతీయ పార్టీ అని చెప్పుకుంటూ రాష్ట్రాలలో పర్యటించింది నువ్వు కాదా అని ప్రశ్నించారు.
ఇప్పుడు కేవలం ఎన్నికల కోసం మాటలు మార్చి తే ఎలా అంటూ నిప్పులు చెరిగా కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy). పవర్ పోతుందేమోనని, తనను జైల్లో వేస్తారేమోనన్న భయం పట్టుకుందన్నారు. అందుకే యాగాలు ఓ వైపు చేస్తున్నాడని ఇంకో వైపు చిల్లర రాజకీయాలు చేయాలని చూస్తున్నాడంటూ ధ్వజమెత్తారు ఎంపీ.
మొత్తంగా కేసీఆర్ కు మతి భ్రమించిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఆయనకు త్వరగా చికిత్స చేయించాల్సిన అవసరం ఉందన్నార కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Also Read : YS Sharmila Slams : సజ్జల కామెంట్స్ షర్మిల కౌంటర్