Komatireddy Venkat Reddy : రేవంత్ రెడ్డీ నాతో పెట్టుకోవద్దు
కోమటరెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్
Komatireddy Venkat Reddy : కాంగ్రెస్ పార్టీలో ఉన్నది ఉన్నట్టు మాట్లాడే నాయకులు కోమటిరెడ్డి బ్రదర్స్ ఒకరు. ఈ ఇద్దరు అన్నదమ్ములకు పార్టీల కంటే ప్రజల్లో మంచి ఆదారాభిమానాలు ఉన్నాయి.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈ ఇద్దరికీ మంచి పట్టుంది. కాక పోతే ఉన్నట్టుండి సుదీర్ఘ అనుబంధం కలిగిన కాంగ్రెస్ పార్టీని వీడారు సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
కానీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం తాను సోనియమ్మ, రాహుల్ గాంధీని విడిచి వెళ్లే ప్రసక్తి లేదంటున్నారు. తాజాగా రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి, పార్టీకి గుడ్ బై చెప్పారు.
ప్రస్తుతం వెంకట్ రెడ్డి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా తన సోదరుడి గురించి రేవంత్ రెడ్డి నోరు జారడం, రాజగోపాల్ రెడ్డి పై అనుచిత కామెంట్స్ చేయడాన్ని తప్పు పట్టారు.
తాము ఇద్దరు అన్నదమ్ములం అయినప్పటికీ ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయన్నారు. బుధవారం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీలో మాట్లాడారు.
ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ కూడా తనతో రాజగోపాల్ రెడ్డి రాజీనామా విషయం కానీ, తాను వెళ్లి పోతున్న సంగతి కానీ తనతో చెప్పలేదన్నారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy).
ఇదే సమయంలో తమ గురించి మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదన్నారు. తనతో పెట్టుకుంటే బాగుండదంటూ ఒక రకంగా హెచ్చరించారు. ఎవరు ఏమిటనేది జనానికి తెలుసన్నారు.
34 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ కోసం పని చేశానని ఆనాడు ఈ రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడని ప్రశ్నించారు. ఎదుటి వ్యక్తులను టార్గెట్ చేసి మాట్లాడే ముందు ఆలోచించాలన్నారు.
Also Read : మునుగోడు గోస వినేదెవ్వరు