Komatireddy Venkat Reddy : నన్ను తిట్టినోళ్లపై విచారణ ఏది
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్స్
Komatireddy Venkat Reddy : ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం పని చేస్తున్న ప్రతి కార్యకర్త పీసీసీ చీఫ్ తో సమానమని అన్నారు. వాళ్లు లేక పోతే ఇన్ని పదవులు రావన్నారు. తమ పార్టీకే కాదు అన్ని పార్టీలకు కార్యకర్తలు, శ్రేణులే ముఖ్యమన్నారు. వాళ్లను విస్మరిస్తే పుట్టగతులు ఉండవన్నారు ఎంపీ.
మంగళవారం ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) నల్గొండలో మీడియాతో మాట్లాడారు. ఆయన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై పరోక్షంగా నిప్పులు చెరిగారు. అసలు పార్టీలో ఏం జరుగుతుందో తెలియడం లేదన్నారు. తనకు షోకాజ్ నోటీసు ఇచ్చారని, కానీ ఇదే సమయంలో తనను బండ బూతులు తిట్టిన వాళ్లపై ఎందుకు విచారణకు ఆదేశించ లేదని ప్రశ్నించారు ఎంపీ.
తనకు ఒక న్యాయం తనను తిట్టిన వాళ్లకు మరో న్యాయం ఎందుకని నిలదీశారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కమిటీల్లో, గాంధీ భవన్ లో ఉంటూ పైరవీలు చేసుకునే వారికే పదవులు కేటాయిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై కూడా పూర్తి విచారణ జరిపించాలని ఎంపీ డిమాండ్ చేశారు.
అప్పుడు ఎవరు నీతిమంతులో ఎవరు పార్టీ కోసం పని చేస్తున్నారో తేలుతుందన్నారు. కాగా కాంగ్రస్ పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలపై దిగ్విజయ్ సింగ్ ను నియమించడాన్ని తాను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికైనా పార్టీలో కొంత మేరకైనా మార్పు వస్తుందని ఆశిస్తున్నట్లుత తెలిపారు ఎంపీ. తాము ఇచ్చిన పేర్లను టీపీసీసీ చీఫ్ పట్టించు కోలేదని ఆరోపించారు.
Also Read : కాంగ్రెస్ లో రచ్చ హైకమాండ్ చర్చ