Komatireddy Venkatreddy : దయాకర్ ను సస్పెండ్ చేయాల్సిందే
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్
Komatireddy Venkatreddy : భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా కోవిడ్ కారణంగా వీడియో సందేశం ద్వారా తాను సారీ చెబుతున్నట్లు ప్రకటించారు రేవంత్ రెడ్డి. ఇదే సమయంలో అద్దంకి దయాకర్ విషయంలో మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkatreddy) .
తాను రేవంత్ రెడ్డి క్షమాపణలు పట్టించు కోనన్నారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అద్దంకి దయాకర్ ను వెంటనే కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
అతడిని పార్టీ నుంచి తప్పించిన తర్వాతే తాను రేవంత్ రెడ్డి సారీని పట్టించు కోనన్నారు. ఆ తర్వాత స్పందిస్తానని చెప్పారు. శనివారం ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఇదిలా ఉండగా ఎంపీ కామెంట్స్ పై తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అద్దంకి దయాకర్ స్పందించారు. మరోసారి తాను వెంకన్నకు క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు.
తాను పార్టీకి విధేయుడినని, కావాలని ఎంపీని అనలేదన్నారు. బహిరంగ సభలో పాల్గొన్న సందర్భంగా ఫ్లోలో అలా ఆ పదం వాడాల్సి వచ్చిందన్నారు అద్దంకి దయాకర్.
పార్టీ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని చెప్పారు. ఎంపీ విషయంలో తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించి క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసు ఇచ్చిందన్నారు. నోటీసులకు కూడా సారీ చెప్పానన్నారు.
భవిష్యత్ లో మరోసారి అలా జరగకుండా చూసుకుంటానని దయాకర్ తెలిపారు.
Also Read : సరిహద్దు వివాదం సంబంధాలపై ప్రభావం