Komatireddy Venkatreddy : త్వ‌ర‌లో హైకమాండ్ తో మాట్లాడ‌తా

పొమ్మ‌న‌కుండా పొగ పెడుతున్నారు

Komatireddy Venkatreddy : తెలంగాణ‌లో కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ వ్య‌వ‌హారం హాట్ టాపిక్ గా మారింది. ఇప్ప‌టికే సోద‌రుడు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు.

అన్న‌ద‌మ్ములు ఇద్ద‌రికీ పార్టీ ఎంతో ప్రాధాన్య‌త ఇచ్చింది. కీల‌క‌మైన ప‌ద‌వులను క‌ట్ట‌బెట్టింది. ఈ మేరకు ఉన్న‌ట్టుండి తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మునుగోడుకు రాజీనామా చేస్తున్నాన‌ని, ఇదే స‌మ‌యంలో పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి కూడా రిజైన్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఆపై ఢిల్లీలో బీజేపీ అగ్ర నాయ‌కుల‌తో భేటీ అయ్యారు. ఆగ‌స్టు 21న కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ సంద‌ర్భంగా మ‌రో సోద‌రుడు భువ‌న‌గిరి ఎంపీగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి త‌న దారి ఎటు వైపు అన్న దానిపై ఉత్కంఠ నెల‌కొంది.

ఈ ఇద్ద‌రి అన్న‌ద‌మ్ముల‌కు మంచి ప‌ట్టుంది ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలో.ఈ సంద‌ర్భంగా శుక్ర‌వారం కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి(Komatireddy Venkatreddy) ఓ ఛాన‌ల్ తో మాట్లాడారు. ఈ మేర‌కు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

పొమ్మ‌న‌కుండా పొగ పెడుతున్నారంటూ ఆరోపించారు. తాను మునుగోడు ఉప ఎన్నిక‌కు దూరంగా ఉంటున్న‌ట్లు చెప్పారు. విచిత్రం ఏమిటంటే ఉప ఎన్నిక క‌స‌ర‌త్తు స‌మావేశం గురించి ఇంత‌వ‌ర‌కు త‌న‌కు చెప్ప‌లేద‌న్నారు.

త‌న‌కు ఇన్విటేష‌న్ లేని దాని కోసం నేను ఎందుకు వెళ్లాల‌ని ప్ర‌శ్నించారు. చండూరులో త‌న‌ను టార్గెట్ చేస్తూ తిట్టించారు. అది పార్టీలోనే కాదు యావ‌త్ తెలుగు ప్ర‌పంచం చూసింద‌న్నారు.

త‌న‌ను హోం గార్డుతో పోల్చ‌డం కూడా ఇందులో భాగ‌మేన‌ని పేర్కొన్నారు.

Also Read : కేంద్రంపై యుద్దం త‌ప్ప‌దు స‌మ‌రం

Leave A Reply

Your Email Id will not be published!