Komatireddy Venkatreddy : రేవంత్ రెడ్డి చెప్పేది న‌డ‌వ‌దు

కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి కామెంట్స్

Komatireddy Venkatreddy : భువ‌న‌గ‌రి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. రైతుల‌కు ఉచిత విద్యుత్ అవ‌స‌రం లేద‌న్న కామెంట్స్ పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాను స్టార్ క్యాంపెయిన‌ర్ న‌ని రేవంత్ రెడ్డికి అంత సీన్ లేద‌న్నారు. ఏ సంద‌ర్బంలో అన్నాడో తాను తెలుసుకుంటాన‌ని చెప్పారు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి(Komatireddy Venkatreddy). రేవంత్ రెడ్డి అనే వ్య‌క్తి కేవ‌లం కోఆర్డినేట‌ర్ మాత్ర‌మేన‌ని అన్నారు.

ఎవ‌రు సీఎం అనేది పార్టీ హై క‌మాండ్ నిర్ణ‌యిస్తుంద‌ని చెప్పారు. సీఎం ప‌ద‌విని ఆనాడే గిరిజ‌నులు, ద‌ళితుల‌కు దివ్వాల‌ని తాను చెప్పాన‌ని అన్నారు. ఉచిత విద్యుత్ అనేది త‌ప్ప‌కుండా ఇస్తామ‌ని , ఇది త‌మ మ్యానిఫెస్టో లో పొందు ప‌ర్చామ‌ని పేర్కొన్నారు. ఏక కాలంలో రెండు ల‌క్ష‌ల రుణ మాఫీ చేస్తామ‌ని హామీ ఇచ్చామ‌ని, దీనికి క‌ట్టుబ‌డి ఉంటామ‌ని స్ప‌ష్టం చేశారు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి.

ఉచిత క‌రెంట్ అనే దాని విష‌యంలో వెన‌క్కి వెళ్లే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. తాను రేవంత్ రెడ్డి కంటే కాంగ్రెస్ పార్టీలో ముందు ఉన్నాన‌ని అన్నారు ఎంపీ. ఆయ‌న చెప్పిన వాటికి ప్ర‌యారిటీ ఉండ‌ద‌న్నారు. ఆయ‌న ఒక‌వేళ అంటే గ‌నుక అది త‌న వ్య‌క్తిగ‌త విష‌య‌మ‌ని స్ప‌ష్టం చేశారు. త‌మ పార్టీకి ఒక సిద్దాంతం అనేది ఉంటుంద‌న్నారు. ఇంకా ప‌క‌డ్బందీగా అమ‌లు చేసేందుకు కృషి చేస్తామ‌న్నారు.

Also Read : CM KCR : సీఎం వ‌ద్ద‌కు క‌డియం..రాజయ్య పంచాయ‌తీ

Leave A Reply

Your Email Id will not be published!