Konda Surekha : నా స్థాయికి ఆ పదవి సరిపోదు – కొండా
ఏఐసీసీ జీఎస్ డిగ్గీ రాజాకు లేఖ
Konda Surekha : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇంకా పదవులపై పోరు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే సేవ్ కాంగ్రెస్ పేరుతో సీనియర్లు ధిక్కార స్వరం వినిపించారు. మరో వైపు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరుతో జోష్ లో ఉన్నారు. ఆయన బీజేపీని, మోదీని టార్గెట్ చేస్తున్నారు. ఈ తరుణంలో తెలంగాణలో మాత్రం పదవుల కోసం ఆందోళన మొదలైంది.
ఇప్పటికే తనకు కేటాయించిన పదవి వద్దంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి కొండా సురేఖ(Konda Surekha) రాజీనామా సమర్పించారు. తాజాగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, ట్రబుల్ షూటర్ గా పేరొందిన దిగ్విజయ్ సింగ్ కు నేరుగా లేఖ రాశారు. తనకు రాజకీయంగా 30 ఏళ్ల అనుభవం ఉందన్నారు.
ఒక ప్రజా ప్రతినిధిగా అపారమైన అనుభవం ఉన్న తనకు ప్రస్తుతం కేటాయించిన పదవి సరిపోదని స్పష్టం చేశారు. తన అర్హత, అనుభవం, ప్రజల మద్దతును పరిగణలోకి తీసుకుని పార్టీ హైకమాండ్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ లేదా ఏఐసీసీ కార్యదర్శి హోదా ఇవ్వాలని కోరారు.
ఈ మేరకు డిగ్గీ రాజాకు రాసిన లేఖలో స్పష్టం చేశారు కొవడా సురేఖ(Konda Surekha). తమ ఫ్యామిలీ పట్ల ప్రజలు నమ్మకంతో ఉన్నారని ఈ సమయంలో తనకు చిన్న పోస్ట్ కేటాయించడం వల్ల అభిమానులు బాధ పడుతున్నారని పేర్కొన్నారు.
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు కేటాయిస్తే లేదా అంతకు మించిన పదవి అప్పగిస్తే తాను ఏమిటో, తన సత్తా ఏమిటో చూపిస్తానని స్పష్టం చేశారు కొండా సురేఖ. ఇదిలా ఉండగా కొండా సురేఖ రాసిన లేఖ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Also Read : అప్పులు తెచ్చిండు ఆగం చేసిండు