Korea Ambassador : సిద్దరామయ్యతో కొరియా రాయబారి భేటీ
ప్రధాన అంశాలపై విస్తృతంగా చర్చలు
Korea Ambassador : కర్ణాటకలో నూతనంగా కొలువు తీరిన సీఎం సిద్దరామయ్యతో భారత దేశంలోని రిపబ్లిక్ ఆఫ్ కొరియా రాయబారి(Korea Ambassador) చాంగ్ జే బాక్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం శుక్రవారం బెంగళూరులో కలుసుకుంది. ఈ సందర్బంగా జే బాక్ టీంకు సాదర స్వాగతం పలికారు సీఎం సిద్దరామయ్యకు. ఆయనకు పుష్ప గుచ్ఛం ఇచ్చారు.
విస్తృతంగా చర్చలు జరిపారు. రాష్ట్రం ఐటీ పరంగా , మౌలిక వసతుల సదుపాయాల కల్పన పరంగా టాప్ లో కొనసాగుతోంది. ఇదే సమయంలో ప్రపంచంలోని టాప్ కంపెనీలు బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం పడి పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. ఆ వెంటనే సీఎంగా ఉన్న సిద్దరామయ్య కార్య క్షేత్రంలోకి దూకారు. కీలక అంశాలపై ఫోకస్ పెట్టారు. రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకు పోవాలనే దానిపై దృష్టి సారించారు. ఈ మేరకు ప్రభుత్వ ఉన్నతాధికారులతో విస్తృతంగా సమీక్షలు చేపడుతున్నారు.
మరో వైపు పరిశ్రమల పరంగా మరికొన్నింటిని రాష్ట్రానికి తీసుకు రావాలన్నది సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కల. ఇప్పటికే ఎన్నికల సందర్భంగా ప్రజలకు గ్యారెంటీ స్కీంలను ప్రకటించింది. ఈ మేరకు వాటిని అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది ప్రభుత్వం. తాజాగా సర్కార్ ఏర్పాటైన తర్వాత సీఎం సిద్దరామయ్యను విదేశీ రాయబారి కలవడం మొదటి సారి. సీఎం సిద్దరామయ్య కొరియా రాయబారి చాంగ్ జే బాక్ మధ్య ఒప్పందం కుదిరింది.
Also Read : Buggana Rajendranath Reddy : జీఎస్టీలో ఏపీ టాప్ – బుగ్గన