Ruchira Kamboj : శాంతికి విఘాతం కొరియా క్షిప‌ణి ప్ర‌యోగం

ఉత్త‌ర కొరియా నిర్వాకంపై భార‌త్ ఆగ్ర‌హం

Ruchira Kamboj : ఉత్త‌ర కొరియా క్షిప‌ణిని ప్ర‌యోగించింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లు దేశాలు ఈ మిస్సైల్ టెస్టింగ్ ను ఖండించాయి. ఇదే స‌మ‌యంలో నిత్యం శాంతి, సామ‌ర‌స్య‌త‌ను కోరుతోంది భార‌త దేశం. తాజాగా ఉత్త‌ర కొరియా చేపట్టిన క్షిప‌ణి ప‌రీక్ష‌ను తీవ్రంగా ఖండించింది. ఇది పూర్తిగా ప్ర‌పంచ శాంతికి విఘాతం క‌ల‌గ‌డం త‌ప్ప మ‌రొక‌టి కాద‌ని పేర్కొంది.

శాంత్రి, భ‌ద్ర‌త‌పై ప్ర‌భావం చూపుతుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. అంతే కాకుండా ఉత్త‌ర కొరియాకు సంబంధించి ఐక్య రాజ్య స‌మితి భ‌ద్ర‌తా మండ‌లి తీర్మానాల‌ను పూర్తిగా అమ‌లు చేయాల‌ని భార‌త్ కోరింది.

ఇదిలా ఉండ‌గా ఉత్త‌ర కొరియా క్షిప‌ణి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం వ‌రుస‌గా ఈ ఏడాది 24వ సారి. యుఎస్, యుకె, ఫ్రాన్స్ ల‌లో చేరిన భార‌త దేశం ఉత్త‌ర కొరియా బాలిస్టిక్ క్షిప‌ణి ప్ర‌యోగాన్ని తీవ్రంగా ఖండించింది.

ఇది జ‌పాన్ ను అధిగ‌మించింది. ఈ ప్రయోగాలు ప్రాంతం, వెలుపుల శాంతి, భ‌ద్ర‌త‌ను తీవ్ర ప్ర‌భావితం చేస్తాయ‌ని భార‌త ప్ర‌భుత్వం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

కాగా ఉత్త‌ర కొరియా ప్ర‌యోగించిన ఈ క్షిప‌ణి ఐదేళ్ల‌లో ఉత్త‌ర కొరియా నుంచి జ‌పాన్ మీదుగా ప్ర‌యాణించడం ఇదే తొలిసారి. యుఎన్ లోని భార‌త శాశ్వ‌త ప్ర‌తినిధి రుచిరా కాంబోజ్(Ruchira Kamboj) డీపీఆర్ పై జ‌రిగిన స‌మావేశంలో స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు దీనిని తాము ఖండిస్తున్న‌ట్లు చెప్పారు.

యుఎస్ రాయ‌బారి లిండా థామ‌స్ , బ్రెజిల్ , ఫ్రాన్స్ , ఐర్లాండ్ , జ‌పాన్ , నార్వే, ద‌క్షిణ కొరియా, యూఏఈ, యుకె, యుఎస్ త‌ర‌పున సంయుక్త ప్ర‌క‌ట‌న చేశారు.

Also Read : సిక్కు ఫ్యామిలీ హ‌త్య‌పై సీఎం దిగ్భ్రాంతి

Leave A Reply

Your Email Id will not be published!