Margaret Alva : కోష్యారీ కామెంట్స్ మార్గరెట్ అల్వా సీరియ‌స్

మ‌రాఠా వాసుల‌పై వ్యాఖ్య‌లు బాధాక‌రం

Margaret Alva : మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌త్ సింగ్ కోష్యారీ చేసిన కామెంట్స్ పై తీవ్ర దుమారం చెల‌రేగుతోంది. గుజ‌రాతీలు, రాజ‌స్థానీలు అంద‌రూ వెళ్లి పోతే ముంబై లేదా థానే లో డ‌బ్బులు మిగ‌ల‌వ‌ని పేర్కొన‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు ప్ర‌తిప‌క్షాల ఉమ్మ‌డి ఉప రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి, మాజీ కేంద్ర మంత్రి మార్గ‌రెట్ అల్వా.

శ‌నివారం త‌న అధికారిక ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు. ఇది పూర్తిగా అహంకార పూరిత‌మైన మ‌న‌స్త‌త్వానికి నిద‌ర్శ‌నమ‌ని పేర్కొన్నారు అల్వా. గ‌వ‌ర్న‌ర్ వ్యాఖ్య‌లు దుర‌దృష్ట‌క‌రం, కానీ ఊహించిన‌ది కాద‌న్నారు.

ఇదే స‌మ‌యంలో ప్ర‌స్తుతం త‌న‌కు పోటీదారుగా ఉన్న ప‌శ్చిమ బెంగాల్ గ‌వ‌ర్న‌ర్ గా ప‌ని చేసిన జ‌గ‌దీప్ ధ‌న్ ఖ‌ర్ పై కూడా నిప్పులు చెరిగారు. ఆ రాష్ట్రంలో సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ప‌ట్ల ఇదే ధోర‌ణితో వ్య‌వ‌హ‌రించారు.

రాజ్యాంగేత‌ర శ‌క్తిగా ప్ర‌వ‌ర్తించారు. ఒక ర‌కంగా చెప్పాలంటే తాను గ‌వ‌ర్న‌ర్ న‌న్న సంగ‌తి మ‌రిచి పోయార‌ని ఆరోపించారు. గ‌వ‌ర్న‌ర్ రాష్ట్రానికి ర‌క్ష‌కుడు. కానీ కేంద్రంలో ఉన్న పార్టీకి ప్ర‌తినిధి కాద‌న్న సంగ‌తి గుర్తుంచు కోవాల‌ని స్ప‌ష్టం చేశారు మార్గ‌రెట్ అల్వా(Margaret Alva).

మూర్ఖ‌పు వ్యాఖ్య‌లు, తానే రాజ్యాంగానికి ప్ర‌తినిధిగా వ్య‌వ‌హ‌రించ‌డం అన్న‌ట్టుగా ప్ర‌వ‌ర్తించారంటూ మండిప‌డ్డారు. కోష్యారీ చేసిన వ్యాఖ్య‌లు , గ‌తంలో ధ‌న్ ఖ‌ర్ చేసిన కామెంట్స్ రెండూ ఒక్క‌టేన‌ని పేర్కొన్నారు.

ఇదిలా ఉండ‌గా మ‌రాఠాలో గ‌వ‌ర్న‌ర్ కామెంట్స్ పై భ‌గ్గుమంటోంది. దీంతో సీఎం షిండే ఆయ‌న వ్య‌క్తిగ‌త‌మ‌ని పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా మార్గరెట్ అల్వా చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపాయి.

Also Read : గ‌వ‌ర్న‌ర్ కామెంట్స్ తో ఏకీభ‌వించం 

Leave A Reply

Your Email Id will not be published!