Kothakota Srinivas Reddy : సన్ బర్న్ ఈవెంట్ పై సీపీ సీరియస్
ఆది నుంచి వివాదాల మయం
Kothakota Srinivas Reddy: హైదరాబాద్ – హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. న్యూ ఇయర్ వేడుకలకు కొద్ది రోజులే ఉండడంతో ఇప్పటి నుంచే చర్యలకు శ్రీకారం చుట్టారు. క్రిస్మస్ సెలబ్రేషన్స్ ప్రస్తుతం కొనసాగుతున్నాయి. డిసెంబర్ 31 వరకు ఈవెంట్స్ నగర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా సన్ బర్న్ ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు ఈ మేరకు టికెట్లను విక్రయించే పనిలో పడడం సంచలనంగా మారింది.
Kothakota Srinivas Reddy Serious
మరోసారి వివాదం చోటు చేసుకుంది. అనుమతి లేకున్నా బుక్ మై షో లో టికెట్లను అమ్మడం ప్రారంభించారు. దీనిపై కాంగ్రెస్(Congress) సర్కార్ సీరియస్ అయ్యింది. నగరంలో పెద్ద ఎత్తున సన్ బర్న్ ఈవెంట్ కు ఏర్పాట్లు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది. దీంతో రంగంలోకి దిగారు సీపీ శ్రీనివాస్ రెడ్డి.
గతంలో సన్ బర్న్ ఆధ్వర్యంలో చేపట్టే ఈవెంట్ పై పలు వివాదాలు చోటు చేసుకున్నాయి. అసాంఘిక కార్యకలాపాలకు కేరాఫ్ గా మారిందన్న విమర్శలు లేక పోలేదు. ఆనాడు దీని ద్వారా చేపట్టే ఈవెంట్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. ఈవెంట్ పేరుతో సన్ బర్న్ డ్రగ్స్ ను కూడా సరఫరా చేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి.
Also Read : Pawan Kalyan : జనసేన అభ్యర్థులపై పవన్ కసరత్తు