Dhruv Narayan Died : కాంగ్రెస్ సీనియర్ నేత కన్నుమూత
కర్ణాటకలో తీవ్ర విషాదం
Dhruv Narayan Died : ఎన్నికల వేళ కర్ణాటక కాంగ్రెస్ లో విషాదం అలుముకుంది. పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు , కర్ణాటక కాంగ్రెస్ పార్టీ కమిటీ ప్రెసిడెంట్ ధృవ నారాయణ్ గుండె పోటుతో శనివారం కన్నుమూశారు. ఆయనకు 61 ఏళ్లు. ధృవ నారాయణ్(Dhruv Narayan Died) రెండు సార్లు శాసనసభ్యుడిగా ఉన్నారు. పార్టీ తరపున ఎంపీగా కూడా పని చేశారు. ఫిబ్రవరి 4న ఛాతిలో నొప్పి రావడంతో మైసూర్ లోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు.
ధృవ్ నారాయణ్ ఆకస్మిక మృతి పట్ల ఏఐసీసీ మాజీ చీఫ్ , వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే , కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ , మాజీ సీఎం సిద్దరామయ్య తీవ్ర సంతాపం తెలిపారు. ఒక గొప్ప నాయకుడిని, నిబద్దత కలిగిన వ్యక్తిని పార్టీ కోల్పోయిందని పేర్కొన్నారు డీకే శివకుమార్. ఇది పార్టీకి తీరని లోటుగా పేర్కొన్నారు .
ధృవ నారాయణ్ జూలై 31, 1961లో కర్ణాటక లోని చామరాజనగర్ లోని హగ్గవాడలో పుట్టారు. డిగ్రీ చదివారు. గత రెండు సంవత్సరాలుగా ఆయన కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ , మే నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో పాల్గొంటూ వచ్చారు.
ఈసారి నంజనగూడు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. అంతలోనే ఆయనకు ఛాన్స్ లేకుండా చేశాడు దేవుడు. ధృవ్ నారాయణ్ అజాత శత్రువుగా పేరు పొందారు. ఇతర పార్టీల నేతలతో కూడా సత్ సంబంధాలు ఉండేలా చూశారు. ఆయా పార్టీలకు చెందిన ప్రముఖులు, నాయకులు తీవ్ర సంతాపం తెలిపారు.
Also Read : గవర్నర్ నిర్వాకం స్టాలిన్ ఆగ్రహం