Atirudra Yagam : ఘనంగా అతిరుద్ర యాగం ప్రారంభం
జడ్చర్లలో అంగరంగ వైభవం
Atirudra Yagam : శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ ఆధ్వర్యంలో సోమవారం జడ్చర్లలో 80వ విశ్వ శాంతి మహాయాగ(Atirudra Yagam) మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ యాగానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భక్తులు తరలి వస్తున్నారు యాగంలో పాల్గొనేందుకు. లోక కళ్యాణం కోసం , యావత్ మానవాళి ఆయురారోగ్యాలతో ఉండాలని ఉత్సవానికి శ్రీకారం చుట్టారు స్వరూపానంద స్వామీజీ.
Atirudra Yagam Started
ఉదయం 7 గంటలకు గోపూజ చేపట్టారు. 7.30 గంటలకు తులసి పూజ నిర్వహించారు, 9 గంటలకు సహస్ర లింగార్చన, రుద్రాభిషేకం, 10 గంటలకు కోటి కుంకుమార్చన చేపట్టారు. గణపతి పూజ, శుద్ది పుణ్యహవాచనం, పంచగవ్య ప్రాశన, బుత్విక్ వరుణ, గో సహిత యాగశాల ప్రవేశం, అఖండ జ్యోతి స్థాపన, యాగశాల సంస్కారములు, మాతృకాపూజ, వాస్తు హోమాలు, ప్రధాన మంటప ఆరాధన, ప్రధాన కలశ స్థాపన , అగ్ని మథన, అగ్ని ప్రతిష్ట, ధ్వజారోహణం, పర్యగ్నీకరణ నిర్వహించారు స్వామి వారు.
ఈనెల 14న ప్రారంభమైన యాగ మహోత్సవం ఆగస్టు 27 వరకు కొనసాగుతుందని యాగ నిర్వాహకులు వెల్లడించారు. భక్తులు పాల్గొని ఆయురారోగ్యాలు పొందాలని కోరారు. కుల, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ఎవరైనా సరే ఈ యాగంలో పాల్గొనవచ్చని సూచించారు.
Also Read : Charminar Express : చార్మినార్ ఎక్స్ ప్రెస్ లో దొంగల బీభత్సం