Krishna Kumari Rai: ఎమ్మెల్యేగా సీఎం సతీమణి ప్రమాణం ! 24 గంటల్లోనే రాజీనామా !
ఎమ్మెల్యేగా సీఎం సతీమణి ప్రమాణం ! 24 గంటల్లోనే రాజీనామా !
Krishna Kumari Rai: ఈశాన్య రాష్ట్రమైన సిక్కిం రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ సతీమణి కృష్ణ కుమారి రాయ్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే తన పదవికి రాజీనామా చేసారు. ఈ నేపథ్యంలో కృష్ణ కుమారి రాజీనామాను సిక్కిం స్పీకర్ ఎంఎన్ షేర్పా ఆమోదించినట్టు అసెంబ్లీ కార్యదర్శి లలిత్ కుమార్ గురుంగ్ తెలిపారు.
Krishna Kumari Rai…
సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా పార్టీ తరఫున నామ్చి-సింగితాంగ్ నియోజకవర్గం నుంచి సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ సతీమణి కృష్ణ కుమారి రాయ్ పోటీ చేసి విజయం సాధించారు. ఈ క్రమంలో ఆమె ఎమ్మెల్యేగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, అనూహ్యంగా ఆమె మరుసటి రోజే(గురువారం) ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
ఈ నేపథ్యంలో కృష్ణ కుమారి రాయ్(Krishna Kumari Rai) రాజీనామాపై సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ తన సోషల్ మీడియా ఫేస్ బుక్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘నా జీవిత భాగస్వామి ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పించింది. ఎస్‌కేఎం పార్టీ పార్లమెంటరీ కమిటీ అభ్యర్థన మేరకు ఆమె ఎన్నికల్లో పోటీ చేసింది. సభ్యుల ఏకగ్రీవ నిర్ణయంతో ఆమె తన పదవి నుంచి వైదొలగినట్లు రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాను. ఆమె మాకు ఇచ్చిన మద్దతుకు హృదయపూర్వక కృతజ్ఞతలు’ అంటూ కామెంట్స్ చేశారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో సోరెంగ్-చకుంగ్, రెనోక్ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ విజయం సాధించారు. దీనితో సోరెంగ్-చకుంగ్ స్థానానికి రాజీనామా చేశారు. ఇది ఇలా ఉండగా అతని సతీమణి కృష్ణ కుమారి రాయ్ నామ్చి-సింగితాంగ్ నియోజకర్గం నుండి పోటీ చేసి, గెలుపొంది, ప్రమాణ స్వీకారం కూడా చేసి, 24 గంటలు తిరగకుముందే తన పదవికి రాజీనామా చేసారు. ఎన్నికల నియమావళి 1961 సెక్షన్ 67/A ప్రకారం రెండు స్థానాల్లో పోటీ చేసి గెలిచిన అభ్యర్థులు ఫలితాలు ప్రకటించిన 14 రోజులలోపు ఒక నియోజకవర్గాన్ని వదులుకోవాల్సి ఉంటుంది.
Also Read : PM Modi Meeting : ద్వైపాక్షిక అంశాలపై 3 దేశాల నేతలతో భేటీ అయిన ప్రధాని మోదీ