Krishnajyothi Swaroopanda Swamy : యాగం జీవన యోగం
శ్రీశ్రీశ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ
Krishnajyothi Swaroopanda Swamy : షాద్ నగర్ – యాగం నిర్వహించడం వల్ల అనేక శుభాలు కలుగుతాయని సెలవిచ్చారు ప్రముఖ శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ. హైదరాబాద్ కు సమీపంలో ఉన్న షాద్ నగర్(Shadnagar) పట్టణంలోని సాయి బాలాజీ టౌన్ షిప్ ఎదురుగా ఉన్న మైదానంలో ఆదిత్య చండీ అతి రుద్రం శ్రీ సీత రామ సామ్రాజ పట్టాభిషేకం 81వ విశ్వశాంతి మహా యాగాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా స్వామీజీ మీడియాతో మాట్లాడారు.
Krishnajyothi Swaroopanda Swamy Comment
వైదిక శాస్త్ర ప్రకారంగా నిర్వహించే యాగాలతో ఉన్నత ఫలితాలు సాధించవచ్చు అని చెప్పారు. పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యంతో జీవ రాశుల తో పాటు మానవులకు ఎంతో హాని జరుగుతుందని ఆవేదన చెందారు.
మరోపక్క ఓజోన్ పొరకు కూడా రంద్రం ఏర్పడుతుందని వివరించారు . యాగంలో ఉపయోగించే పదార్థాల ద్వారా కాలుష్యాన్ని అరికట్టవచ్చని, ఓజోన్ పొర ను సైతం కాపాడుకోవచ్చని వివరించారు స్వామీజీ.
వైదిక శాస్త్రం ప్రకారం నిర్వహించే యాగాలతో వచ్చే ఫలితాలను భగవద్గీతలో వివరంగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. భవిష్యత్తులో విష వ్యాధులు రాకుండా ప్రకృతి సమతుల్యతను కాపాడు కోవడానికి ఈ యాగాలు ఎంత దోహద పడతాయని చెప్పారు శ్రీశ్రీశ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ.
ఇదిలా ఉండగా అతిరుద్ర మహా యాగం గురువారం అక్టోబర్ 26న ఘనంగా ప్రారంభమైంది. భక్తులు తండోప తండాలుగా తరలి వచ్చారు. ఈ యాగం వచ్చే నెల నవంబర్ 8వ తేదీ వరకు జరుగతుందన్నారు స్వామీజీ.
ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం 1:00 వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి వరకు జరిగే ఈ యాగాలలో ప్రజలు పాల్గొనాలని, భగవంతుని కృపకు పాత్రులు కావాలని కోరారు.
Also Read : Motkupalli Narasimhulu : హస్తం గూటికి మోత్కుపల్లి