KS Eshwarappa : దేశ వ్యతిరేకులకు కాంగ్రెస్ మద్దతు
మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప ఆరోపణ
KS Eshwarappa : కర్ణాటక మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప షాకింగ్ కామెంట్స్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ వ్యతిరేకులకు, శక్తులకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు మంత్రి.
ఈ దేశంలో ఓ వర్గానికి చెందిన వారు నేరుగా హిందువులపై కావాలని దాడికి దిగుతున్నారంటూ మండిపడ్డారు. కర్ణాటకలోని శివ మొగ్గ లేదా దేశ వ్యాప్తంగా జాతీయ వ్యతిరేకులకు ఎవరు మద్దతు ఇస్తున్నారో దేశ ప్రజలందరికీ తెలుసన్నారు.
దీని వెనుక కాంగ్రెస్ పార్టీ ఉందంటూ మండిపడ్డారు కేఎస్ ఈశ్వరప్ప. తమ రాష్ట్రంలో పీఎఫ్ఐ, ఎస్డీపీఐ , ఇతర దేశ వ్యతిరేకులందరికీ ఆ పార్టీ మద్దతు ఇస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
శివమొగ్గలో మత పరమైన ఉద్రిక్తత చోటు చేసుకున్న తరుణంలో హిందూ వ్యతిరేక శక్తులు నేరుగా దాడి చేయాలని చూస్తున్నారంటూ వాపోయారు.
ఆర్ఎస్ఎస్ కు ఆద్యుడు వీర సావర్కర్ ఫోటోను తొలగించిన వ్యక్తి ఎస్డీపీఐ కార్యకర్త. ఆయన భార్య కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ గా ఉన్నారంటూ ఆరోపించారు మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప(KS Eshwarappa).
నిన్న ఈశ్వరప్ప భారత దేశంలో నివసిస్తున్న ముస్లింలకు హెచ్చరికలు జారీ చేశారు. హిందూ పండుగలకు సహకరించడం వారి విధి అని స్పష్టం చేశారు.
ముస్లింలను కంట్రోల్ లో ఉంచాల్సిన బాధ్యత వారి పెద్దలపై ఉందన్నారు. లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు కేఎస్ ఈశ్వరప్ప.
శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నం చేస్తోందని చెప్పారు మాజీ మంత్రి. ముస్లింలు అందరినీ తాను తప్పు పట్టడం లేదని స్పష్టం చేశారు.
Also Read : రష్యాతో ఆయిల్ కొనుగోలు కరెక్టే – జైశంకర్