KTR : బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీకే సీటు
ఖరారు చేసిన మాజీ మంత్రి కేటీఆర్
KTR : హైదరాబాద్ – భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 17 ఎంపీ సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం చేవెళ్ల ఎంపీగా కొనసాగుతున్నారు డాక్టర్ రంజిత్ రెడ్డి. తాజాగా ఆయనకే మరోసారి టికెట్ కేటాయించినట్లు వెల్లడించారు కేటీఆర్. పార్టీ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకునన్నట్లు స్పష్టం చేశారు.
KTR Comment
చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గంకు సంబంధించి సమీక్ష చేపట్టారు కేటీఆర్(KTR). ఈ గడ్డపై మరోసారి గులాబీ జెండా రెప రెప లాడేలా చేయాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రజా ప్రతినిధులు, నాయకులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు కేటీఆర్.
బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ఆఫీసులో చేవెళ్ల పార్లమెంట్ సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కీలక సమావేశంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, ప్రకాశ్ గౌడ్, ఆర్కే పూడి గాంధీ, మాజీ ఎమ్మెల్యేలు కొప్పుల మహేష్ రెడ్డి, మెతుకు ఆనంద్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. పార్టీ పరంగా ఒక్క ఓటు ఇతర పార్టీలకు వెళ్లేందుకు వీలు లేదని పర్కొన్నారు.
Also Read : Abhaya Hastam : 28 నుంచి అభయ హస్తం