KTR : రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్(KTR) కీలక ప్రకటన చేశారు. స్వచ్ఛ సర్వేక్షణ్ -2022 కింద ఐఎల్ఎస్ అవార్డులు గెలుపొందిన 19 మున్సిపాలిటీలకు రూ. 2 కోట్ల చొప్నున నజరానాగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు మంత్రి.
ఇందులో భాగంగా పురస్కారాలు అందుకున్న పురపాలిక బృందాలను దేశంలోని ఇతర రాష్ట్రాలకు పంపనున్నారు. 10 మంది అధికారులను జపాన్, సింగపూర్ లకు స్టడీ టూర్ కు పంపిస్తామని తెలిపారు కేటీఆర్. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల్లో సమిష్టి చైతన్యం పెంపొందించాలని కోరారు.
డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రం క్యాంపస్ లో విజేతలకు బహుమతులు అందజేశారు. నిధులను ఎక్కడెక్కడ ఖర్చు చేయాలనే దానిపై సీడీఎంఏ మార్గ నిర్దేశనం చేస్తారని చెప్పారు కేటీఆర్. పారిశుధ్యానికి నిధులు ఖర్చు చేయాలని సూచించారు కేటీఆర్.
స్వచ్ఛ సర్వేక్షణ్ లో అత్యధిక అవార్డులు తెలంగాణ రాష్ట్రానికి దక్కడం విశేషం. భారత దేశంలోనే తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో నిలవడం గర్వించ దగిన విషయంగా పేర్కొన్నారు మంత్రి. కింది స్థాయిలో పని చేసిన కార్మికులు, సిబ్బంది, రాష్ట్ర స్థాయిలో పని చేసిన అధికారులను ప్రత్యేకంగా అభినందించారు.
19 మున్సిపాలిటీలకు చెందిన చైర్ పర్సన్లు , కమిషనర్లు, అడిషనల్ కలెక్టర్లను ప్రశంసించారు కేటీఆర్. ఉత్సాహ వంతులైన యంగ్ , ఎనర్జటిక్ ఆఫీసర్లను ఎంపిక చేసిన విదేశాలకు పంపిస్తామన్నారు.
ఈ సందర్భంగా పురస్కారాలు పొందిన పురపాలికలు మరింత ఆదర్శవంతంగా నిలవాలని కోరారు మంత్రి కేటీఆర్. సమిష్టి చైతన్యం అద్భుతాలను సృష్టిస్తుందన్నారు.
Also Read : విజయ సాయి రెడ్డికి కీలక పదవి