KTR Appeal : అండగా నిలవండి సాయం చేయండి
పార్టీ శ్రేణులకు మంత్రి కేటీఆర్ పిలుపు
KTR Appeal : ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ కేంద్రం డైరెక్టర్ కె. నాగరత్న ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని కోరారు.
KTR Appeal Says
హైదారాబాద్ తో పాటు ఇతర ప్రాంతాలలో వానలు దంచి కొడుతున్నాయి. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వందలాది వాహనాలు ఎక్కడికక్కడ నిలిచి పోయాయి. నగరం ఓ వలయాన్ని తలపింప చేస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
5 నుంచి 6 సెంటీ మీటర్ల వర్షం కురుస్తుందని అప్రమత్తంగా ఉండక పోతే ఇబ్బందులు తప్పవని పేర్కొనడంతో మంత్రి కేటీఆర్(KTR) అలర్ట్ అయ్యారు. పార్టీకి సంబంధించిన నాయకులు, శ్రేణులు ఫోకస్ పెట్టాలని ఆయా ప్రాంతాలలో నగర వాసులకు ఇబ్బందులు లేకుండా చూడాలని పిలుపునిచ్చారు.
తాను కూడా తిరుగుతున్నానని, ఎప్పటికప్పుడు నగర వాసులతో మాట్లాడుతున్నానని తెలిపారు. ట్విట్టర్ వేదికగా కూడా తాను స్పందిస్తున్నట్లు చెప్పారు కేటీఆర్. ముందస్తుగా ఎవరూ కూడా బయటకు రావద్దంటూ సూచించారు మంత్రి కేటీఆర్.
Also Read : Moranchapalli Villagers : మోరంచల్లి గ్రామస్థులు సురక్షితం