KTR Dasoju Sravan : దాసోజుకు భరోసా బెదిరింపులపై ఆరా
వెంటనే విచారణ చేపట్టాలన్న కేటీఆర్
KTR Dasoju Sravan : భారత రాష్ట్ర సమితి అగ్ర నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనుచరులు అర్ధరాత్రి ఫోన్ కాల్స్ చేయడం, మరోసారి మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని స్వయంగా శ్రవణ్ తెలిపారు. ట్విట్టర్ వేదికగా సైబర్ క్రైం, సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ , డీజీపీలకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.
విషయం తెలుసుకున్న వెంటనే ఐటీ , పురపాలిక శాఖా మంత్రి కేటీఆర్(KTR) స్పందించారు. శుక్రవారం ఆయన ట్విట్టర్ వేదికగా డీజీపీ మహమూద్ అలీ, డీజీపీకి ఈ విషయంపై విచారణ చేపట్టాలని సూచించారు. దీనిని సీరియస్ గా తీసుకోవాలని కోరారు కేటీఆర్. ఆలస్యం చేయకుండా వెంటనే రంగంలోకి దిగాలని పేర్కొన్నారు.
ఎవరు బెదిరింపులకు పాల్పడ్డారో వారిని ట్రేస్ అవుట్ చేయాలని అన్నారు కేటీఆర్. ఇది ఎంత మాత్రం ఉపేక్షించే అంశం కాదన్నారు మంత్రి. చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని స్పష్టం చేశారు.
తెలంగాణలో బహిరంగ బెదిరింపులకు ఎవరు పాల్పడినా సహించే ప్రసక్తి లేదని కేటీఆర్ హెచ్చరించారు. దీనికి సంబంధించి చర్యలు చేపడతారని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు.
Also Read : Daggubati Purandeswari : ఇస్రో విజయం గర్వకారణం