KTR Davos : తెలంగాణతో మాస్టర్ కార్డ్స్ ఒప్పందం
దావోస్ లో కేటీఆర్ చర్చలు ఫలప్రదం
KTR Davos : ఇరు తెలుగు రాష్ట్రాలు పెట్టుబడుల్ని ఆకర్షించడంలో, వ్యాపార వేత్తలను ఒప్పించడంలో సక్సెస్ అయ్యాయి. ఏపీ నుంచి సీఎం జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్రం నుంచి మంత్రి కేటీఆర్(KTR Davos) దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (ప్రపంచ ఆర్థిక సదస్సు) లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు.
ఏపీకి భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు గౌతమ్ అదానీ. తాజాగా తెలంగాణ సర్కార్ కు ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన మాస్టర్ కార్డ్స్ ఒప్పందం చేసుకుంది.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పరిశ్రమల, ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్ , మంత్రి కేటీఆర్ మాస్టర్ కార్డ్స్ తరపున సంస్థ ప్రతినిధులు ఎంఓయూ మీద సంతకాలు చేశారు.
ఈ విషయాన్ని స్వతహాగా మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మాస్టర్ కార్డ్స్ ప్రెసిడెంట్ మైఖేల్ ప్రోమాన్ తో గురువారం ఈ సందరర్భంగా ప్రత్యేకంగా సమావేశం అయ్యారు మంత్రి కేటీఆర్(KTR Davos).
డిజిటల్ స్టేట్ పార్టనర్ షిప్ విషయంలో ఇరువురి మధ్య అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ మెరుగైన, వేగవంతమైన డిజిటల్ సేవలు అందించేందుకు మాస్టర్ కార్డ్స్ తో ఒప్పందం చేసుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు మంత్రి కేటీఆర్(KTR Davos).
ఈ అగ్రిమెంట్ వల్ల రైతులు, మధ్య, చిన్న తరహా వ్యాపారులకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు మరింత స్పీడ్ అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు ఐటీ, పురపాలిక శాఖ మంత్రి.
అంతే కాకుండా డిజిటల్ లిటరసీ విషయంలో కూడా మాస్టర్ కార్డ్స్ కలిసి పని చేస్తుందని తెలిపారు.
Also Read : ట్విట్టర్ కు భారీ జరిమానా