KTR : జీఎస్టీ త‌గ్గించాలంటూ కేటీఆర్ డిమాండ్

పోస్ట్ కార్డ్ ప్ర‌చారం తర్వాత ఆన్ లైన్ పిటిష‌న్

KTR : చేనేత కార్మికుల జీవితాల‌ను రక్షించేందుకు, భార‌త దేశ సాంస్కృతిక వార‌స‌త్వాన్ని ప‌రిర‌క్షించేందుకు చేనేత ఉత్ప‌త్తుల‌పై వ‌స్తు సేవ‌ల ప‌న్ను (జీఎస్టీ)ను తొల‌గించాల‌ని కేంద్ర స‌ర్కార్ కు డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్. ఆయ‌న ఇప్ప‌టికే ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీని డిమాండ్ చేశారు.

పోస్ట్ కార్డు ప్ర‌చారంతో పాటు తాజాగా ఆన్ లైన్ పిటిష‌న్ ను ప్రారంభించారు. యాంత్రిక శ‌క్తి స‌హాయం లేకుండా ప్ర‌త్యేక‌మైన ఉత్ప‌త్తుల‌ను ఉత్ప‌త్తి చేసే దాదాపు 5 మిలియ‌న్ల మంది చేనేత కార్మికులు భార‌త దేశంలో నివసిస్తున్నార‌ని మంత్రి పిటిష‌న్ లో పేర్కొన్నారు.

అత్యంత వికేంద్రీక‌రించ‌బ‌డిన గ్రామీణ ఆధారిత చేనేత ప‌రిశ్ర‌మ దాని శ్ర‌మ శ‌క్తిలో ఎక్కువ‌గా మ‌హిళ‌ల‌ను క‌లిగి ఉంద‌న్నారు. చేనేత ఉత్ప‌త్తుల‌పై 5 శాతం జీఎస్టీని వెన‌క్కి తీసుకోవాల‌ని కోరారు. మంత్రి కేటీఆర్(KTR) సోమ‌వారం ఛేంజ్.ఓఆర్జీ లో ఆన్ లైన్ పిటిష‌న్ ను ప్రారంభించారు.

ఈ పిటిష‌న్ పై ట్వీట్ చేశారు. ప్ర‌తి ఒక్క‌రూ పిటిష‌న్ పై సంత‌కం చేయాల‌ని కోరారు కేటీఆర్. మ‌హోన్న‌త‌మైన ల‌క్ష్యం కోసం ప్ర‌జ‌లు చేతులు క‌ల‌పాల‌ని విన్న‌వించారు. చేనేత రంగంపై జీవ‌నోపాధి పొందుతున్న ల‌క్ష‌లాది మందికి చేనేత‌పై జీఎస్టీ ప్ర‌త్య‌క్ష ముప్పుగా మారింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

చేనేత‌పై ప‌న్నుల‌ను వ్య‌తిరేకిస్తున్నార‌ని ఇది భారీ న‌ష్టాల‌కు దారి తీసింద‌న్నారు. చేనేత రంగం అతి పెద్ద అసంఘిత రంగాల్లో ఒక‌ట‌ని గ్రామీణ‌, పాక్షిక గ్రామీణ జీవ‌నోపాధిలో అంత‌ర్భాగ‌మ‌ని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

Also Read : 31న మునుగోడులో బీజేపీ బ‌హిరంగ స‌భ‌

Leave A Reply

Your Email Id will not be published!