KTR : ఇచ్చిన మాట నిలబెట్టు కోవడంలో సీఎం కేసీఆర్ తర్వాతే ఎవరైనా అని పేర్కొన్నారు మంత్రి కేటీఆర్(KTR). భారత రాష్ట్ర సమితి అంటే భారత రైతు సమితి అని మరోసారి రుజువు చేశారని కొనియాడారు. తాను ఈ సందర్బంగా సీఎం కు ధన్యవాదాలు తెలియ చేస్తున్నానని తెలిపారు కేటీఆర్.
KTR Comments
జై కిసాన్ అనేది కొందరు నినాదంగా వాడుతున్నారని కానీ అది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు మంత్రి. కేంద్రం అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్ర సర్కార్ ఆదాయం తగ్గిందని ఆరోపించారు. అయినా ఎక్కడ కూడా తాము రైతులకు ఇబ్బందులు కలిగించ లేదన్నారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో రైతు బంధు తీసుకు వచ్చామని తెలిపారు. ఇదే సమయంలో గతంలో సీఎం ప్రకటించినట్లుగా రైతు రుణ మాఫీలు చేస్తామని స్పష్టం చేశారని పేర్కొన్నారు.
ఇప్పటికే నిధులను మాఫీ చేయడం ప్రారంభమైందన్నారు కేటీఆర్. బీజేపీ సర్కార్ అడుగడుగునా ఆర్థిక ఇబ్బందులు సృష్టించిందని ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న సంకల్ప బలానికి నిలువెత్తు నిదర్శనమని అన్నారు. రైతు సంక్షేమంలో తొమ్మిదేళ్ల తెలంగాణ ప్రస్థానం ఇది అని పేర్కొన్నారు. దేశ చరిత్రలోనే ఇది ఒక సువర్ణ అధ్యాయమని అన్నారు కేటీఆర్.
Also Read : Mallikarjun Kharge : సుప్రీంకోర్టు తీర్పుకు థ్యాంక్స్