KTR : ఓటు ఆయుధం మ‌న‌దే విజ‌యం

రాబందుల రాజ్యం కావాలా తేల్చుకోండి

KTR : మునుగోడు ఉప ఎన్నికల ప్ర‌చారంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. రైతు బంధు కావాల‌ని అనుకుంటే టీఆర్ఎస్ కు ఓటు వేయాల‌ని కోరారు. 18 వేల కోట్ల కాంట్రాక్టు కోసం అమ్ముడు పోయిన రాజ‌గోపాల్ రెడ్డి వైపు ఉంటారో మీ విజ్ఞ‌త‌కు వ‌దిలి వేస్తాన‌ని అన్నారు.

మంగ‌ళ‌వారం నారాయ‌ణ‌పురంలో రోడ్ షో నిర్వ‌హించారు. కేటీఆర్ రోడ్ షోకు భారీ ఎత్తున జ‌నం హాజ‌ర‌య్యారు. ప‌ద‌వుల కోసం పార్టీలు మారే వ్య‌క్తులు ఎలా ప్ర‌జ‌ల‌కు సేవ‌లు అందిస్తారో ఆలోచించాల‌ని అన్నారు కేటీఆర్. మాయ మాట‌లు చెబుతూ ప్ర‌జా కంట‌కులుగా మారిన వారిని ఎలా న‌మ్ముతారంటూ ప్ర‌శ్నించారు.

దేశంలోనే కాదు రాష్ట్రంలో ఉన్న వ‌న‌రుల‌ను దోచుకునేందుకు బీజేపీ య‌త్నిస్తోందంటూ ఆరోపించారు కేటీఆర్(KTR). అందుకే బీజేపీ కులం, మ‌తం, ప్రాంతాల పేరుతో రాజ‌కీయాలు చేస్తోంద‌ని మండిప‌డ్డారు. మునుగోడు ఉప ఎన్నిక బీజేపీకి క‌నువిప్పు కావాల‌ని పిలుపునిచ్చారు. కోట్ల రూపాయ‌ల‌కు అమ్ముడు పోయినోడు రాజ‌గోపాల్ రెడ్డి.

ఇంటింటికీ తులం బంగారం కూడా ఇస్తడు. ఆ డ‌బ్బుల‌న్నీ మ‌న‌వే. అంటే ప్ర‌జ‌ల‌వ‌ని అర్థం. ఆయ‌న ఏది ఇచ్చినా తీసుకోండి కానీ ఓటు మాత్రం గులాబీ జెండాకు వేయాల‌ని కోరారు కేటీఆర్. టీఆర్ ఎస్ కు ఓటు వేస్తే అది అభివృద్దికి మ‌లుపు అవుతుంద‌ని గుర్తుంచు కోవాల‌ని అన్నారు.

డ‌బ్బుల‌కు, మ‌ద్యానికి లొంగ‌కండి ప‌ని చేసే వాళ్ల‌ను ఎన్నుకోవాల‌ని కోరారు కేటీఆర్. ఎవ‌రైనా పైకి పోతే ఉప ఎన్నిక వ‌స్త‌ది. కానీ ఇక్క‌డ అమ్ముడు పోతే వ‌స్త‌ద‌ని ఎద్దేవా చేశారు.

 

Also Read : ద‌మ్ముంటే అమేథీలో గెలిచి చూపించు – కేటీఆర్

Leave A Reply

Your Email Id will not be published!