KTR : డీకేఎస్ స‌వాల్ కు కేటీఆర్ రెడీ

ట్విట్ట‌ర్ లో ఇద్ద‌రి మ‌ధ్య ఆస‌క్తిక‌ర ట్వీట్స్

KTR  : క‌ర్ణాట‌క (karnataka) రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ డీకే శివ‌కుమార్ కు మంత్రి కేటీఆర్ (KTR )కు మ‌ధ్య ఆస‌క్తిక‌ర‌మైన సంభాష‌ణ చోటు చేసుకుంది. గ‌తంలో ఐటీ అనే పేరు ఎత్తే స‌రిక‌ల్లా చ‌టుక్కున బెంగ‌ళూరు గుర్తుకు వ‌చ్చేది.

కానీ ఇప్పుడు ఆ సీన్ మారింది. బెంగళూరుకు (Bengaluru) ధీటుగా హైద‌రాబాద్ (Hyderabad) ఎదిగింది. ప్ర‌పంచంలోని టాప్ కంపెనీల‌న్నీ ఇక్క‌డే కొలువు తీరాయి. ప్ర‌స్తుతం ఏర్పాటైన టీఆర్ఎస్ (TRS) ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాలు మంచి ఫ‌లితాలు ఇస్తున్నాయి.

ప్ర‌ధానంగా ఐటీ, ఫార్మా, అగ్రి, త‌దితర వాటిలో కీల‌కంగా మారింది హైద‌రాబాద్ (Hyderabad) న‌గ‌రం. కాగా మ‌న సిటీ సెంట‌ర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. దేశానికి ఒక రోల్ మోడ‌ల్ గా త‌యారైంది.

ప్ర‌స్తుతం బెంగ‌ళూరుతో (Bengaluru) పోటీ ప‌డుతోంది హైద‌రాబాద్. కొన్ని రోజుల కింద‌ట బెంగ‌ళూరులో మౌళిక స‌దుపాయాలు లేవంటూ ఓ సంస్థ ఫిర్యాదు చేసింది.

దీనికి స్పందించిన కేటీఆర్(KTR )మీకు ఎలాంటి భ‌యం , అనుమానం అక్క‌ర్లేద‌ని వెంట‌నే హైద‌రాబాద్ కు రావ‌చ్చంటూ స‌మాధానం ఇచ్చారు . ఇన్నోవేష‌న్, ఇన్ ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ , ఇంక్లూజివ్ గ్రోత్ పై తెలంగాణ స‌ర్కార్ ఫోక‌స్ పెట్టింద‌ని వెల్ల‌డించారు కేటీఆర్.

కాగా కేటీఆర్ చేసిన ట్వీట్ కే డీకే శివ‌కుమార్ (DK Shivkumar) స్పందించారు. 2023లో త‌మ స‌ర్కార్ వ‌స్తుంద‌ని, బెంగ‌ళూరు ఐటీకి పూర్వ వైభవం తీసుకు వ‌స్తామ‌ని పేర్కొన్నారు.

మీరు విసిరిన స‌వాల్ ను తాను స్వీకరిస్తున్నాన‌ని తెలిపారు కేటీఆర్. కాగా అక్క‌డ ఎవరు గెలుస్తారో చెప్ప‌లేమ‌ని ఇరు న‌గ‌రాల మ‌ధ్య బంధం బాగుండాల‌ని పేర్కొన్నారు మంత్రి.

Also Read : డ్ర‌గ్స్ కేసులో కీల‌క అంశాలు – డీసీపీ

Leave A Reply

Your Email Id will not be published!