KTR Revanth Reddy : రేవంత్ రెడ్డికి ఏదో రోగం ఉంది – కేటీఆర్
ఐటీ, పురపాలిక శాఖ మంత్రి ఫైర్
KTR Revanth Reddy : ఐటీ, పురపాలిక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆయన టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పదే పదే కోట్ల రూపాయల కుంభకోణాలు అంటూ ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నాడంటూ ఆరోపించారు కేటీఆర్. వైఎస్సార్ గురించి కేసీఆర్ ప్రతిసారి గొప్పగా చెబుతూనే వచ్చారని గుర్తు చేశారు. ఈ విషయాన్ని శాసన సభలో సీఎం ప్రకటించారని పేర్కొన్నారు.
KTR Revanth Reddy Dispute
వైఎస్సార్ కాంగ్రెస్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లి పోయిందన్నారు కేటీఆర్(KTR). ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ వేరని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి కల్లు తాగిన కోతి లాగా ప్రవర్తిస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే హైకమాండ్ పట్టించుకుని రేవంత్ ను ఆస్పత్రికి చూపించాలని సూచించారు.
కొందరికి రైట్ టు ఇన్ఫర్మేషన్ (ఆర్టీఐ) అంటే రూట్ టూ ఇన్ఫర్మేషన్ గా మారిందంటూ ఎద్దేవా చేశారు మంత్రి కేటీఆర్. దేశంలో ఎక్కడా లేని రీతిలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత కేసీఆర్ కు దక్కుతుందన్నారు. ఇదేదీ గమనించకుండా విమర్శలు చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
Also Read : Tirumala Rush : తిరుమలకు పోటెత్తిన భక్తజనం