KTR Telangana : తెలంగాణ‌లో మా తాండా మా రాజ్యం

స్ప‌ష్టం చేసిన మంత్రి కేటీఆర్

KTR Telangana : మంత్రి కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ ద‌శాబ్ది ఉత్స‌వాల‌లో భాగంగా శ‌నివారం గిరిజ‌న దినోత్స‌వం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. గ‌తంలో ఉమ్మ‌డి ఏపీ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఆదివాసీలు, గిరిజ‌నులు తీవ్ర ఇబ్బందుల‌కు లోన‌య్యార‌ని పేర్కొన్నారు. కానీ ఎప్పుడైతే సీఎం కేసీఆర్ సార‌థ్యంలో వ‌చ్చిన తెలంగాణ రాష్ట్రంలో తండాలు ఇప్పుడు క‌ళ క‌ళ లాడుతున్నాయ‌ని స్ప‌ష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 9 ఏళ్లు పూర్త‌యింది. ప్ర‌స్తుతం 10వ సంవ‌త్స‌రంలోకి అడుగు పెట్టింది. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌భుత్వం ద‌శాబ్ది ఉత్స‌వాలు నిర్వ‌హిస్తూ వ‌స్తోంది స‌ర్కార్. ఇవాళ జ‌రుగుతున్న గిరిజ‌న దినోత్స‌వం మా తండాల్లో మా రాజ్యం ఇవాళ ఆచ‌ర‌ణ‌లో చేసి చూపించిన ఘ‌న‌త సీఎం కేసీఆర్ కు ద‌క్కుతుంద‌న్నారు మంత్రి కేటీఆర్(KTR). ద‌శాబ్దాల పాటు ద‌గాప‌డ్డ ఈ నినాదం కొన‌సాగింద‌న్నారు.

స్వ‌రాష్ట్ర సాధ‌న క‌ల‌ను నెర‌వేర్చ‌డమే కాదు గిరిజ‌నులు, ఆదివాసీ బిడ్డ‌ల చిర‌కాల డిమాండ్ ను త‌మ ప్ర‌భుత్వం తీర్చింద‌న్నారు కేటీఆర్. స్వ‌యం పాల‌నా స్వ‌ప్నాన్ని కూడా సాకారం చేశార‌ని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న అసాధార‌ణ చ‌ర్య‌ల వ‌ల్ల విసిరేసిన‌ట్టుగా ఉన్న తండాల్లో అద్భుత‌మైన వికాసం క‌నిపిస్తోంద‌న్నారు. గోస‌ప‌డ్డ గోండు గూడేల్లో అచంచ‌ల విశ్వాసం కొన‌సాగుతోంద‌న్నారు మంత్రి కేటీఆర్.

Also Read : Anil Kumble YS Jagan : సీఎం జ‌గ‌న్ ను క‌లిసిన కుంబ్లే

Leave A Reply

Your Email Id will not be published!