KTR : హైదరాబాద్ లో క్లోవర్‌టెక్స్ సెంటర్
వెల్లడించిన ఐటీ మంత్రి కేటీఆర్
KTR : మంత్రి కేటీఆర్(KTR) అమెరికా టూర్ లో బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే పలు కంపెనీలు హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించాయి. ఇప్పటికే న్యూయార్క్ వేదికగా అమెరికా కాన్సులేట్ నిర్వహించిన సదస్సులో పాల్గొన్నారు. కీలక ప్రకటన చేశారు. తమ ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు సహాయ సహకారాలు అందజేస్తుందని స్పష్టం చేశారు.
తాజాగా మరో కీలక ప్రకటన చేశారు. లైఫ్ సైన్సెస్ పరిశ్రమ కోసం సైంటిఫిక్ క్లౌడ్ కంప్యూటింగ్ లో టాప్ రేంజ్ లో కొనసాగుతోంది క్లోవర్ టెక్స్ కంపెనీ. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం తరపున ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో తన గ్లోబల్ కెపాసిటీస్ సెంటర్ (జీసీసీ)ని విస్తరించాలని యోచిస్తున్నట్లు ప్రకటించింది.
క్లోవర్ టెక్స్ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ క్షితిజ్ కుమార్ , ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(KTR) నేతృత్వంలోని మేనేజ్ మెంట్ బృందం మధ్‌య కీలక సమావేశం జరిగింది. రాష్ట్రంలో ఎలాంటి వాతావరణం ఉందో కూలంకుశంగా వివరించారు మంత్రి. బోస్టన్ లోని ప్రధాన కార్యాలయం వెలుపల క్లోవర్ టెక్స్ మొదటి కేంద్రం ఏర్పాటు చేసింది. దాదాపు రూ. 100 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. దాదాపు కంపెనీ ఏర్పాటు చేస్తే 100 నుంచి 150 ఉద్యోగులను నియమించుకునే ఛాన్స్ ఉంది. ఈ సందర్బంగా క్లోవర్ టెక్స్ కంపెనీని ప్రత్యేకంగా అభినందించారు కేటీఆర్.
Also Read : Jacqueline Fernandez