KTR Industries : ప‌ల్లెల్లో పారిశ్రామిక వెలుగులు – కేటీఆర్

మ‌హ‌బూబాబాద్ జిల్లాలో మిర‌ప ప్రాసెసింగ్ కంపెనీలు

KTR Industries : భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ ఆధ్వ‌ర్యంలోని తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకున్న చ‌ర్య‌ల కార‌ణంగా పెద్ద ఎత్తున ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాట‌వుతున్నాయి. ఐటీ, ఫార్మా, లాజిస్టిక్, టెలికాంతో పాటు స్టార్ట‌ప్ లు సైతం పెద్ద ఎత్తున కొలువు తీరుతున్నాయి. ల‌క్ష‌లాది మందికి ఉపాధి క‌లుగుతోంది. తాజాగా రాష్ట్రంలోని మ‌హ‌బూబాబాద్ జిల్లాల్లో మిర్చి ప్రాసెసింగ్ ప్లాంట్ ల‌ను ఏర్పాటు చేశారు. ఈ విష‌యాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆదివారం పంచుకున్నారు.

తెలంగాణ‌లో అత్య‌ధికంగా ఈ ప్రాంతంలో మిర్చి పంట‌ను ఎక్కువ‌గా పండిస్తున్నారు. వార్షిక ఉత్ప‌త్తి సుమారుగా 1.5 ల‌క్ష‌లు కాగా మొత్తం తెల‌గాణ ఉత్ప‌త్తిలో 25 శాతంగా ఉంద‌ని వెల్ల‌డించారు. జిల్లాలో ఉత్ప‌త్తి అయ్యే మిర్చి నాణ్య‌త‌ను ప్ర‌పంచ వ్యాప్తంగా అత్యున్న‌త‌మైన‌దిగా గుర్తించార‌ని తెలిపారు కేటీఆర్(KTR).

ఇందులో భాగంగా మిర్చి రైతుల‌ను ఆదుకునేందుకు గాను ప్ర‌భుత్వం భారీ ఎత్తున మిర‌ప ప్రాసెసింగ్ ప్లాంట్ ల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు పేర్కొన్నారు. వీటి ద్వారా సంవ‌త్స‌రానికి ఒక ల‌క్ష ఎంటీల మిర‌ప‌ను ప్రాసెసింగ్ చేయొచ్చిన‌ట్లు తెలిపారు కేటీఆర్. ఈ రెండు యూనిట్లు ఒలియోరెసిన్ తీసుకుంటాయ‌ని, ఈ యూనిట్ల నుండి ఎగుమ‌తులు ప్ర‌పంచ వ్యాప్తంగా 85 శాతం కంటే ఎక్కువ దేశాల‌కు ర‌వాణా చేయ‌నున్న‌ట్లు పేర్కొన్నారు.

Also Read : Tirumala Rush : భ‌క్త జ‌న సందోహం తిరుమ‌ల క్షేత్రం

Leave A Reply

Your Email Id will not be published!