KTR : హైద‌రాబాద్ లో ఒకుజెన్ ఆర్ అండ్ డి సెంట‌ర్

దిగ్గ‌జ సంస్థ ఏర్పాటు చేస్తుంద‌న్న కేటీఆర్

KTR : తెలంగాణ ఐటీ ,ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయ‌న అమెరికాలో ప‌ర్య‌టిస్తున్నారు. కేటీఆర్ వెంట ప‌రిశ్ర‌మ‌ల శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి జ‌యేష్ రంజ‌న్ కూడా ఉన్నారు. ఈ సంద‌ర్భంగా పెట్టుబ‌డిదారులు, కంపెనీలు, ఇత‌ర ముఖ్యులు, వ్యాపార‌వేత్త‌లు, ఔత్సాహికులతో వ‌రుస‌గా భేటీలు అవుతున్నారు కేటీఆర్.

ఇప్ప‌టికే ఆయ‌న న్యూయార్క్ లో అమెరిక‌న్ కాన్సులేట్ స‌మావేశంలో ప్ర‌సంగించారు. తెలంగాణ ఏ ర‌కంగా పెట్టుబ‌డిదారుల‌కు సానుకూలంగా ఉందో వివ‌రాలతో స‌హా వెల్ల‌డించారు. భార‌త దేశంలోనే ఐటీ, లాజిస్టిక్ , ఫార్మా ప‌రంగా టాప్ లో తెలంగాణ ఉంద‌న్నారు కేటీఆర్.

గురువారం మ‌రో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు మంత్రి కేటీఆర్. హైద‌రాబాద్ లో శ‌క్తివంత‌మైన బ‌యోటెక్ ఎకో సిస్ట‌మ్ కు , మాడిఫైయ‌ర్ జ‌న్యు చికిత్స‌లు , పున‌రుత్ప‌త్తి క‌ణ చికిత్స‌పై సారించిన ఒకుజెన్ కంపెనీ ఆర్ అండ్ డి (రీసెర్చ్ అండ్ డెవ‌ల‌ప్ మెంట్ సెంట‌ర్ )ను ఏర్పాటు చేయ‌నుంద‌ని స్ప‌ష్టం చేశారు.

దీని వ‌ల్ల మ‌రో దిగ్గ‌జ కంపెనీ వ‌చ్చిన‌ట్ల‌యింద‌ని తెలిపారు. ఆర్ అండ్ డి వ‌స్తే నైపుణ్యం క‌లిగిన వారికి జాబ్స్ వ‌స్తాయ‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి కేటీఆర్. ఈ సంద‌ర్బంగా సెంట‌ర్ ను ఏర్పాటు చేయ‌బోయే ఒకుజెన్ కంపెనీని ప్ర‌త్యేకంగా అభినందిస్తున్న‌ట్లు తెలిపారు.

Also Read : MK Stalin Jallikattu

Leave A Reply

Your Email Id will not be published!