KTR Rahul Gandhi : రాహుల్ గాంధీ పొలిటికల్ టూరిస్ట్
నిప్పులు చెరిగిన మంత్రి కేటీఆర్
KTR Rahul Gandhi : కాంగ్రెస్ అగ్ర నేత , వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీపై సెటైర్ విసిరారు మంత్రి కేటీఆర్(KTR). రాహుల్ ను పొలిటికల్ టూరిస్ట్ అంటూ ఎద్దేవా చేశారు.
సరైన సమాచారం లేకుండా ఎవరో ఏదో స్క్రిప్టు రాసి ఇస్తే చదివే రాహుల్ గాంధీకి(Rahul Gandhi) తెలంగాణ రాష్ట్రం గురించి ఏం తెలుసు అని ప్రశ్నించారు. ఎవరు నీతి మంతులో జనానికి తెలుసన్నారు.
అన్ని రంగాలలొ తమ రాష్ట్రం టాప్ లో ఉందన్నారు. ఐటీ హబ్, ఫార్మా హబ్ , అగ్రి హబ్, సినీ హబ్ ఇలా చెప్పుకుంటూ తెలంగాణ ముందంజలో కొనసాగుతోందని పేర్కొన్నారు.
రైతులకు తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు ఏ రాష్ట్రంలో కూడా అమలు కావడం లేదని స్పష్టం చేశారు. ముందు తమ పార్టీని చక్కదిద్దుకుని ఇతర పార్టీలను విమర్శించాలని సూచించారు మంత్రి కేటీఆర్(KTR).
పదవి ఉంది కదా అని ఏదో ఒకటి మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఊరుకోబోరంటూ హెచ్చరించారు. పొలిటికల్ టూరిస్టులు వస్తారు పోతారు కానీ ఉద్యమ నాయకుడు,
తెలంగాణ స్పూర్తి ప్రదాతగా భావించే, కొలిచే సీఎం కేసీఆర్ ఒక్కడే ఇక్కడే ఉంటాడని స్పష్టం చేశారు కేటీఆర్(KTR). రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదన్నారు.
తాము అమలు చేస్తున్న పథకాలను కేంద్రం కాపీ కొడుతోందని పేర్కొన్నారు కేటీఆర్. అంతే కాదు స్టడీ టూర్ కు వస్తున్న రాహుల్ గాంధీకి స్వాగతం అంటూ వ్యంగ్యంగా పేర్కొనడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Also Read : Rahul Gandhi : టీఆర్ఎస్ పై యుద్దం తప్ప పొత్తుండదు