KTR : హరితహారానికి సర్కార్ సహకారం
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్
KTR : ప్రభుత్వం ప్రవేశ పెట్టిన హరితహారం కార్యక్రమానికి అద్భుతమైన స్పందన వస్తుందన్నారు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(KTR). శుక్రవారం హైదరాబాద్ లోని హైటెక్స్ లో గ్రీన్ ప్రాపర్టీ షో ఏర్పాటు చేశారు. దీనిని మంత్రి ప్రారంభించారు. హరిత జీవన ప్రాముఖ్యత గురించి తెలుసు కోవాల్సిన అవసరం ఉందన్నారు కేటీఆర్.
KTR Green Property Show
తెలంగాణలో తొలి గ్రీన్ ప్రాపర్టీ షో సీఐఐ – ఐజీబీసీ ద్వారా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పర్యావరణం ప్రాముఖ్యత, సుస్థిరత గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి కేటీఆర్.
సీఐఐ-ఐజీబీసీ హరితహారం కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం నుంచి నిరంతరం సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరు మొక్కలు, చెట్లను నాటాలని పిలుపునిచ్చారు కేటీఆర్. హరిత హారం రాష్ట్రానికి మణిహారంగా మారిందన్నారు. దీని వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని పేర్కొన్నారు మంత్రి కేటీఆర్.
హరితహారం కోసం ప్రయత్నం చేసే సంస్థలు, వ్యక్తులు, కంపెనీలను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని స్పష్టం చేశారు ఐటీ, పురపాలిక , పరిశ్రమల శాఖ మంత్రి.
Also Read : CM KCR Announce : జూలై 31న తెలంగాణ కేబినెట్ భేటీ