KTR : బీజేపీ నేత‌ల మాట‌ల‌న్నీ బ‌క్వాస్ – కేటీఆర్

న‌లుగురు ఎమ్మెల్యేల వ్య‌వ‌హారంపై కామెంట్

KTR :  తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీకి చెందిన న‌లుగురు ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేయాల‌ని భార‌తీయ జ‌న‌తా పార్టీ చేసిన ప్ర‌య‌త్నం పూర్తిగా వైఫ‌ల్యం చెందింద‌ని దీనిని ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి కేటీఆర్(KTR). ఆయ‌న ట్విట్ట‌ర్ వేదికగా స్పందించారు.

ఎనిమిది సంవ‌త్స‌రాల కాలంలో ఏం చేశారో చెప్ప‌మ‌ని తాను చేసిన స‌వాల్ కు ఒక్క‌రు కూడా స్పందించక పోవ‌డం దారుణ‌మ‌న్నారు. త‌మ వారిని కొనుగోలు చేసే ప్ర‌య‌త్నంలో బీజేపీ అడ్డంగా బుక్కైంద‌ని పేర్కొన్నారు. వారి నేత‌లు నీతి సూత్రాలు వ‌ల్లించ‌డంపై మండిప‌డ్డారు.

తాము నోటికి వ‌చ్చిన‌ట్టు ఏవేవో మాట్లాడుతున్నారు. అడ్డు అదుపు లేకుండా మాట్లాడాటం వారికి అల‌వాటుగా మారింద‌ని మండిప‌డ్డారు కేటీఆర్. ఏదైనా నిర్మాణాత్మ‌క‌మైన ఆచ‌ర‌ణ‌తో ముందుకు రావాల‌ని కానీ ఆధారాలు లేకుండా విమ‌ర్శ‌ల‌కు దిగ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కైన ఆయ‌న ఒక‌రు, ఇప్పుడు ఇలా చూస్తుంటే ఏం అనాలో తెలియ‌డం లేద‌న్నారు. ఈ విష‌యం గురించి పార్టీ శ్రేణులు ప‌ట్టించు కోవ‌ద్దంటూ కేటీఆర్(KTR) సూచించారు. మ‌న ప్ర‌ధాన అజెండా ఒక్క‌టే రాష్ట్ర‌, ప్ర‌జ‌ల సంక్షేమం. దేశానికే మ‌న పాల‌న ఆద‌ర్శ‌ప్రాయంగా ఉంద‌న్నారు.

మునుగోడు ఉప ఎన్నిక‌లో తాము ఓడి పోతామ‌నే భ‌యంతోనే ఇలాంటి నీతి మాలిన చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ్డారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు కేటీఆర్. అయినా అక్క‌డ అంతిమంగా గెలిచేది తామేన‌ని జోష్యం చెప్పారు.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ద‌ర్యాప్తులో ఉన్నందు వ‌ల్ల పార్టీకి చెందిన నాయ‌కులు అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌వ‌ద్ద‌ని సూచించారు. మీడియా ముందు ఎలాంటి కామెంట్స్ చేయొద్దంటూ మంత్రి కోరారు.

Also Read : ల‌క్ష్మి..గ‌ణ‌ప‌తి స‌రే అంబేద్క‌ర్ వ‌ద్దా

Leave A Reply

Your Email Id will not be published!