KTR Slams : గవర్నర్ కామెంట్స్ కేటీఆర్ సీరియస్
ప్రసంగమంతా తప్పుల తడక
KTR Slams : హైదరాబాద్ – మాజీ మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం పై శనివారం అసెంబ్లీలో చర్చలో పాల్గొన్నారు కేటీఆర్. ఈ సందర్బంగా గవర్నర్ పూర్తిగా పార్టీ తరపున మాట్లాడినట్లుగా ఉందన్నారు. చేసిన ఆరోపణలన్నీ అబద్దాలేనంటూ మండిపడ్డారు.
KTR Slams Governer
ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. దీనిని బలపరిచారు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. దీనికి మద్దతుగా మాట్లాడారు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి. ఇదిలా ఉండగా ఇది నాలుగోరోజు. శాసన మండలిలో ఎమ్మెల్సీలు దేశిపతి శ్రీనివాస్ , మధుసూధనా చారి ధన్యవాదాలు తెలిపారు.
ప్రతిపక్షం తరపున తొలిసారి బీఆర్ఎస్ శాసన సభా పక్షం నుంచి కేటీఆర్(KTR) ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగం పూర్తిగా బాధ్యతా రాహిత్యంతో ఉందన్నారు. నక్క తాను మోసం చేయనని, పులి తాను మాంసం తినను అన్నట్టుగా తమిళి సై సౌందర రాజన్ తీరు ఉందని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి.
కాంగ్రెస్ పాలనలోనే తెలంగాణ పూర్తిగా ధ్వంసమైందని ఇప్పుడు తమపై బురద చల్లితే ఎలా అని ప్రశ్నించారు. నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ ను నిర్మూలించారా, వలసలను ఆపారా అని ప్రశ్నించారు.
Also Read : Srikanth Goud : శ్రీనివాస్ గౌడ్ తమ్ముడికి షాక్