KTR : ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన గత కొంత కాలం నుంచీ కేంద్రాన్ని, ప్రధానంగా ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ వచ్చారు.
ప్రధాని పైకి మహాత్మా గాంధీ పలుకులు చెబుతారని కానీ చేతుల్లోకి వచ్చేసరికల్లా గాడ్సే లాగా ఉంటాయని సంచలన ఆరోపణలు చేశారు కేటీఆర్(KTR).
కేంద్రాన్ని ప్రశ్నించే వారిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ, ఆదాయ పన్ను శాఖ లతో దాడులు చేయిస్తున్నారంటూ ధ్వజమెత్తారు.
తెలంగాణకు లక్ష కోట్లు ఇచ్చామని చెబుతున్నారని, ఎక్కడ ఎవరికి ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్(KTR). ఇవాళ దేశానికే తెలంగాణ అన్ని రకాలుగా ఇస్తోందని, కేంద్రం ఒక్క పైసా ఎక్కువ రాష్ట్రానికి ఇవ్వడం లేదంటూ మండిపడ్డారు.
మన రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో కేంద్రానికి రూ. 3. 65 లక్షలు వెళితే కేంద్రం నుంచి మనకు కేవలం రూ. 1.68 కోట్లు మాత్రమే వస్తున్నాయంటూ ధ్వజమెత్తారు. మిగతా సొమ్ము ఎక్కడికి పోయిందని నిలదీశారు కేటీఆర్.
అంతే కాదు దేశానికి ప్రస్తుతం తెలంగాణ భాండాగారంగా ఉందన్నారు మంత్రి. రాష్ట్రంలో కుల, మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.
గోల్ మాల్ తెలంగాణ కావాలా లేక గ్లోబల్ గా గుర్తింపు కలిగిన రాష్ట్రం కావాలో తేల్చు కోవాలని స్పష్టం చేశారు. కొత్త రాష్ట్రమని కేంద్రం అడిగిన ప్రతిసారి మద్దతు ఇస్తూ వెళ్లామని కానీ చివరకు తమను మోదీ మోసం చేశారంటూ వాపోయారు కేటీఆర్.
తెలంగాణ లో ప్రజలు తమ వైపు ఉన్నారని చెప్పారు. రాబోయే కాలం తమదేనని పేర్కొన్నారు.
Also Read : పోరుగల్లు సభపై కాంగ్రెస్ ఫోకస్