KTR Rahul Gandhi : రాహుల్ కు క్లబ్బులు..పబ్బులు తెలుసు
వడ్లు..ఎడ్లు తెల్వదంటూ కేటీఆర్ ఎద్దేవా
KTR Rahul Gandhi : మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీపై సంచలన ఆరోపణలు చేశారు. ఆయనకు అంత సీన్ లేదన్నారు. రైతులతో మాట్లాడినంత మాత్రాన రైతు ఎలా అవుతాడంటూ ప్రశ్నించారు. రాహుల్ గాంధీకి క్లబ్బులు, పబ్బులు తప్ప వడ్లు, ఎడ్లు తెల్వదు అంటూ ఎద్దేవా చేశారు కేటీఆర్. ఆయన లీడర్ కాదు కేవలం రీడర్ మాత్రమేనంటూ ధ్వజమెత్తారు మంత్రి.
80 వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు కడితే లక్ష కోట్ల అవినీతి జరిగిందని రాహుల్ గాంధీ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన అవివేకానికి బాధ పడాలో నవ్వాలో తెలియడం లేదన్నారు. ఆయనకు స్క్రిప్టు రాసి ఇచ్చిన కాంగ్రెస్ నేతలకు కనీసం సోయి అన్న ఉండాలి కదా అని ప్రశ్నించారు. రాహుల్ అవివేకాన్ని చూసి దేశమంతా చూసి నవ్వుకుంటోందన్నారు కేటీఆర్(KTR).
రాష్ట్రంలో తాము రైతుల కోసం , వ్యవసాయ రంగానికి ఉచితంగా విద్యుత్ ఇస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంట్ ఇచ్చేందుకు వద్దంటోందన్నారు. దీనిని ప్రజలు ఒప్పుకునేందుకు సిద్దంగా లేరని పేర్కొన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమని జోష్యం చెప్పారు కేటీఆర్.
ప్రతిపక్షాలకు నిరాధార ఆరోపణలు చేయడం తప్ప మరోటి తెలియదన్నారు కేటీఆర్. ఇకనైనా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆలోచించు కోవాలన్నారు. ఎన్ని వ్యూహాలు పన్నినా బీఆర్ఎస్ ను ఎదుర్కొనే దమ్ము లేదన్నారు కేటీఆర్.
Also Read : Prabhas Top : ప్రజాదరణ నటుల్లో ప్రభాస్ టాప్
