KTR Revanth Reddy : రేవంత్ కామెంట్స్ పై కేటీఆర్ ఫైర్
రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు
KTR Revanth Reddy : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అమెరికాలోని తానా వేదికగా జరిగిన సభలో 24 గంటల ఉచిత విద్యుత్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ . రేవంత్ మాటల్ని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తెలంగాణ ప్రజలను మోసం చేసే దిశగా ఉందని అర్థమవుతందన్నారు. మంగళవారం కేటీఆర్(KTR) మీడియాతో మాట్లాడారు. తాము పవర్ లోకి వస్తే 8 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తామని చెప్పడం దారుణమన్నారు.
ప్రజల్ని, రైతులను తప్పు దోవ పట్టించేలా కామెంట్స్ చేయడం మంచి పద్దతి కాదని హితవు పలికారు. రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ను నిరసిస్తూ నిరసనలు, ఆందోళనలు, దిష్టి బొమ్మలను దగ్ధం చేయాలని పిలుపునిచ్చారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ర్యాలీలు, నిరసనలు చేపట్టింది. రైతులకు కేవలం మూడు గంటలు మాత్రమే ఇవ్వాలని పేర్కొనడం రైతుల పట్ల ఏ మాత్రం ప్రేమ ఉందో తెలుస్తుందన్నారు.
రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు చెప్పినట్లు నడుచుకుంటున్నాడంటూ సంచలన ఆరోపణలు చేశారు మరో బీఆర్ఎస్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్.
Also Read : Komatireddy Venkatreddy : రేవంత్ రెడ్డి చెప్పేది నడవదు