KTR Thanks To CM : ఐటీ, పురపాలిక శాఖ మంత్రి సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. ఈ మేరకు లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థులకు ఊరట ఇచ్చేలా సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. వారందరి తరపున తాను కృతజ్ఞతలు తెలియ చేస్తున్నానని పేర్కొన్నారు కేటీఆర్(KTR).
KTR Thanks To CM KCR
దీని వల్ల ఆయా పరీక్షలకు సన్నద్దం అయ్యే అభ్యర్థులకు మరింత వెసులుబాటు కలుగుతుందన్నారు. ఇదిలా ఉండగా గ్రూప్ -2 పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ గత కొన్ని రోజుల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టారు అభ్యర్థులు. చివరకు బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్పీ దీక్షకు దిగారు. తమకు చదువుకునేందుకు కాస్త సమయం కావాలని కోరారు. వీరి ఇబ్బందులను గమనించిన సీఎం కేసీఆర్ వెంటనే స్పందించారు. ఈ మేరకు గ్రూప్ -2 పరీక్ష ఆగస్టులో కాకుండా వచ్చే నవంబర్ లో నిర్వహించాలని ఆదేశించారు. వెంటనే రీ షెడ్యూల్ చేయాలని స్పష్టం చేశారు కేసీఆర్ సీఎస్ శాంతి కుమారికి.
దీంతో ఆమె వెంటనే టీఎస్పీఎస్సీ కి ఆదేశాలు జారీ చేసింది. సీఎం ఆదేశాల మేరకు గ్రూప్ -2 పరీక్షను వాయిదా వేయాలని , రీ షెడ్యూల్ చేయాలని స్పష్టం చేసింది. మొత్తంగా కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఎందరికో మేలు జరుగుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.
Also Read : EX Minister Chandrasekhar : బీజేపీకి షాక్ మాజీ మంత్రి గుడ్ బై