Kukkala Vidyasagar: వైకాపా నేత కుక్కల విద్యాసాగర్‌ అరెస్ట్‌

వైకాపా నేత కుక్కల విద్యాసాగర్‌ అరెస్ట్‌

Kukkala Vidyasagar: బాలీవుడ్‌ నటి కాదంబరీ జత్వానీపై తప్పుడు కేసు పెట్టిన వ్యవహారంలో వైకాపా నేత కుక్కల విద్యాసాగర్‌ ను పోలీసులు అరెస్టు చేశారు. జత్వానీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. సాంకేతిక ఆధారాల సాయంతో వేరే రాష్ట్రంలో ఉన్న విద్యాసాగర్‌ను అరెస్టు చేశారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు విద్యాసాగర్‌ తన స్నేహితుడి మొబైల్‌ వినియోగించారు. అయినా, సాంకేతికత సాయంతో నిందితుడిని పట్టుకున్నారు.

Kukkala Vidyasagar Arrested..

ఫోర్జరీ పత్రంతో తనపై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేసి ఇబ్బందులకు గురి చేశారని జత్వానీ ఇటీవల ఇబ్రహీంపట్నం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇందులో ఐపీఎస్‌ అధికారులు సీతారామాంజనేయులు, కాంతిరాణా, విశాల్‌ గున్ని కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు. ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు వైకాపా నేత కుక్కల విద్యాసాగర్‌ను ఏ1గా చేర్చారు. అతనితో పాటు మరికొందరు అని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. తప్పుడు ఆధారాలను సృష్టించడం, నేరానికి పాల్పడినట్లు తప్పుడు ఆరోపణలు చేయడం, పత్రాలను ఫోర్జరీ చేయడం, తప్పుడు రికార్డులను తయారు చేయడం, తదితర ఆరోపణలపై ఐపీసీలోని 192, 211, 218, 220, 354 (డి), 467, 420, 469, 471 రెడ్‌ విత్‌ 120 (బి), ఐటీ చట్టంలోని 66ఏ సెక్షన్ల కింద కేసు పెట్టిన విషయం తెలిసిందే.

Also Read : YS Jagan : తిరుమల నెయ్యి కల్తీ వివాదంపై స్పందించిన మాజీ ముఖ్యమంత్రి

Leave A Reply

Your Email Id will not be published!