Kumbham Anil Kumar Reddy : కాంగ్రెస్ కు బై బీఆర్ఎస్ కు జై
అనిల్ కుమార్ రెడ్డి చేరిక
Kumbham Anil Kumar Reddy : ఎన్నికలు ఇంకా రానే లేదు అప్పుడే చేరికల పర్వం మొదలైంది. పోటా పోటీగా కాంగ్రెస్ , బీఆర్ఎస్ లో చేరుతుండడం విశేషం. నల్లగొండ జిల్లాలో ప్రస్తుతం మంత్రి జగదీశ్ రెడ్డి హవా కొనసాగుతోంది. మొత్తం నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ మంచి పట్టుంది. అయితే ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పదే పదే రాబోయే ఎన్నికల్లో మొత్తం స్థానాలు గెలుస్తానంటూ ప్రకటించడంతో సీరియస్ గా తీసుకున్నారు జగదీశ్ రెడ్డి.
Kumbham Anil Kumar Reddy Joins
ఇప్పటి నుంచే కీలకమైన నేతలను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా యాదాద్రి జిల్లా డీసీసీ చీఫ్ కుంభం అనిల్ కుమార్ రెడ్డిని(Kumbham Anil Kumar Reddy) పార్టీలో చేరేలా ప్రయత్నం చేశారు. ఆయన చేసిన కృషి ఫలించింది. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్బంగా సీఎం కుంభం అనిల్ కుమార్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు.
ఆయనకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. రాబోయే రోజుల్లో ఊహించని రీతిలో ఆయనకు పదవి దక్కనుందని హామీ ఇచ్చారు. తాను మాట ఇచ్చానంటే ఇక తప్పనంటూ పేర్కొన్నారు కేసీఆర్. ఈ సందర్భంగా ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఒంటెత్తు పోకడలు పడక తాను గులాబీ కండువా కప్పున్నానని అన్నారు కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఆయనతో పాటు భువనగిరికి చెందిన పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు సైతం బీఆర్ఎస్ లో చేరారు.
Also Read : Manipur Violence Comment : ఇంకెంత కాలం ఈ మౌనం