Kunal Ghosh : పార్టీకి..ప్ర‌భుత్వానికి మాయ‌ని మ‌చ్చ – టీఎంసీ

పార్థ వ్య‌వ‌హారంపై కునాల్ ఘోష్ కామెంట్స్

Kunal Ghosh : గ‌త కొంత కాలంగా క్లీన్ ఇమేజ్ స్వంతం చేసుకుంటూ వ‌స్తున్న టీఎంసీ చీఫ్‌, ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీకి ఇది కోలుకోలేని షాక్.

ఇప్ప‌టికే దేశంలో 9 రాష్ట్రాల‌ను కూల‌దోసి యావ‌త్ భార‌త‌మంతా భార‌తీయ జ‌న‌తా పార్టీ మాత్ర‌మే ఉండాల‌న్న ల‌క్ష్యంతో ముందుకు సాగుతోంది కేంద్రం.

మోదీ త్ర‌యం చాప‌కింద నీరులా పావులు క‌దుపుతోంది. అవ‌కాశం కోసం వేచి చూస్తోంది. దాని ప‌రిధిలో ఉన్న అన్ని ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను ప్ర‌యోగిస్తోంది.

కాదంటే దాడులు లేదంటే కేసులు. కుద‌ర‌ద‌ని అనుకుంటే గ‌వ‌ర్న‌ర్ ద్వారా ప్ర‌య‌త్నం చేస్తోంది. కానీ ఎన్ని ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు వచ్చినా వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి వంద శాతం కూల్చే యాక్ష‌న్ పూర్తి కావాల‌ని అనుకుంటోంది.

ఇందులో భాగంగా ప‌శ్చిమ బెంగాల్ ను టార్గెట్ చేసింది. ఈ మేర‌కు టీఎంసీలో కీల‌క మంత్రిగా ఉన్న పార్థ ఛ‌ట‌ర్జీపై క‌న్నేసింది. టీచర్ స్కాం లాగింది.

ఆయ‌న‌కు చెందిన స‌న్నిహితురాలైన న‌టి ఇంట్లో కుప్ప‌లు తెప్ప‌లుగా నోట్ల క‌ట్ట‌లు బ‌య‌ట ప‌డ్డాయి. చివ‌ర‌కు మంత్రి అరెస్ట్ దాకా వెళ్లింది.

దీంతో నిన్న‌టి దాకా బీజేపీపై నిప్పులు చెరుగుతూ వ‌చ్చిన టీఎంసీ ఇప్పుడు మౌనంగా నేల చూపులు చూస్తోంది. ప‌ట్టుబ‌డిన డ‌బ్బులు ఎవ‌రివి అనే దానిపై ఇంకా లెక్క‌లు తీయ‌లేదు.

చెప్పేందుకు లేవు కూడా. దీంతో మౌనం త‌ప్ప మ‌రేమీ మాట్లాడ లేని స్థితికి చేరుకుంది ఆ పార్టీ. ఈ సంద‌ర్భంగా టీఎంసీ అధికార ప్ర‌తినిధి కునాల్ ఘోష్(Kunal Ghosh) సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

పార్థ నిర్వాకం వ‌ల్ల పార్టీకి, ప్ర‌భుత్వానికి మాయ‌ని మ‌చ్చ మిగిల్చారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Also Read : ‘అర్పిత’ ఫ్లాట్ లో రూ. 29 కోట్లు..5 కేజీల బంగారం

Leave A Reply

Your Email Id will not be published!