Kunal Ghosh : పార్థ ఛటర్జీ అరెస్ట్ పై జోక్యం చేసుకోం
ప్రకటించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ
Kunal Ghosh : దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది పశ్చిమ బెంగాల్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పార్థ ఛటర్జీ అరెస్ట్ వ్యవహారం. ఆయనకు సన్నిహితురాలిగా పేరొందిన ప్రముఖ నటి ఆర్షిత ఛటర్జీ ఇంట్లో కేంద్ర దర్యాప్తు సంస్థ మూకుమ్మడి దాడి చేసింది.
విస్తు పోయేలా రూ. 500, రూ. 2,000 నోట్ల కట్టలు కుప్పలుగా దొరికాయి. దాదాపు బ్యాంకు అధికారులతో లెక్కించిన ఈడీ రూ. 20 కోట్లకు పైగా నగదు దొరికిందంటూ ప్రకటించింది.
అంతే కాదు ఆమె నుంచి 20 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకుంది. అంతే కాకుండా ఈ కేసుకు సంబంధించి విద్యా శాఖ సహాయ మంత్రి, ఎమ్మెల్యేపై కూడా ఏక కాలంలో ఈడి దాడులకు పాల్పడింది.
భారీ ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా నగదు పట్టుబడిన మహిళతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.
ఈ విషయాన్న ఆ పార్టీ అధికార ప్రతినిధి ఆదివారం వెల్లడించారు. గతంలో విద్యా శాఖ మంత్రిగా పార్థ ఛటర్జీ పని చేసిన సమయంలో పెద్ద ఎత్తున స్కాం చోటు చేసుకుందని ఫిర్యాదులు వచ్చాయి.
ఈ మేరకు ఈడీ నేరుగా రంగంలోకి దిగింది. అయితే అరెస్ట్ చేసిన మంత్రిపై నిర్ణీత కాల వ్యవధిలో దర్యాప్తు జరపాలని టీఎంసీ డిమాండ్ చేసింది. ఎవరైనా నాయకుడు ఏదైనా తప్పు చేసినట్లయితే పార్టీ రాజకీయంగా జోక్యం చేసుకోదంటూ కుండ బద్దలు కొట్టింది.
కునాల్ ఘోష్(Kunal Ghosh) ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఆమెతో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. చట్టం తన పని తాను చేసుకు పోతుందన్నారు.
Also Read : ఇంకోసారి నోరు జారితే జాగ్రత్త – జైరాం