Kuno National Park: కునో నేషనల్ పార్క్ లో మరో చీతా మృతి ! 10కి చేరిన చీతా మరణాలు

కునో నేషనల్ పార్క్ లో మరో చీతా మృతి ! 10కి చేరిన చీతా మరణాలు

Kuno National Park: మధ్యప్రదేశ్‌ లోని కునో నేషనల్ పార్కులో మరో చీతా చనిపోయింది. ఇటీవల నమీబియా నుంచి తెచ్చిన చీతాల్లో ఒకటైన శౌర్య మంగళవారం మృతి చెందినట్లు కునో నేషనల్ పార్కు అధికారులు వెల్లడించారు. శౌర్య అనే చీతా ఉదయం తూలుతూ నడవడాన్ని గుర్తించిన ట్రాకింగ్ మెంబర్స్… వెంటనే దానికి చికిత్స అందించారు. అయితే శౌర్య కాస్త కోలుకున్నట్లు అనిపించినప్పటికీ మధ్యాహ్నం 3 గంటల ప్రారంతంలో అది చనిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. పోస్టు మార్టం తరువాత చీతా మృతికి గల కారణాలపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని కునో నేషనల్ పార్కు అధికారులు తెలిపారు. అయితే శౌర్య మరణంతో కునో నేషనల్ పార్కులో మరణించిన చీతాల సంఖ్య పదికి చేరుకుంది.

Kuno National Park Cheeta Death Viral

అంతరించిపోయిన చీతా వన్యప్రాణి జాతిని భారత్‌లో పునఃప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ‘ప్రాజెక్టు చీతా’ను చేపట్టింది. ఇందులో భాగంగా నమీబియా, దక్షిణాఫ్రికాల నుంచి రెండు విడతల్లో 20 చీతాలను భారత్‌కు రప్పించారు. మొదటి విడతగా నమీబియా ఎనిమిది చీతాలను భారత్ కు తెప్పించిన కేంద్ర ప్రభుత్వం… ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్‌ 17, 2022న వాటిని మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్క్‌లో(Kuno National Park) విడిచిపెట్టారు. ఆ తరువాత దక్షిణాఫ్రికా నుండి మరో 12 చీతాలను తెప్పించి… ఫిబ్రవరి 18, 2023న అదే పార్కులో విడిచిపెట్టారు. అయితే ఈ 20 చీతాల్లో పలు కారణాలతో ఇప్పటి వరకు ఆరు చీతాలు చనిపోయాయి. గతేడాది మార్చిలో జ్వాల అనే నమీబియా చీతాకు నాలుగు కూనలు పుట్టగా… అనారోగ్య కారణాలతో అందులో మూడు మృతి చెందాయి. తాజా ఘటనతో… ఇప్పటివరకు మరణించిన చీతాల సంఖ్య 10కి చేరింది.

Also Read : Tammineni Veerabhadram: సీపీఎం నేత తమ్మినేని వీరభద్రానికి గుండెపోటు !

Leave A Reply

Your Email Id will not be published!