Kuruva Vijay Kumar : రూ. 600 కోట్ల‌కు 65 సీట్ల బేరం

డాక్ట‌ర్ కురువ విజ‌య్ కుమార్

Kuruva Vijay Kumar : హైద‌రాబాద్ – టీపీసీసీలో టికెట్ల వ్య‌వ‌హారం మ‌రింత ముదురుతోంది. 119 సీట్ల‌కు గాను ఏఐసీసీ స్క్రీనింగ్ క‌మిటీ 55 మందితో తొలి జాబితాను ప్ర‌క‌టించింది. ప‌లు చోట్ల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. నాగ‌ర్ క‌ర్నూల్ లో పార్టీ కోసం ప‌ని చేస్తున్న త‌న‌కు కాకుండా ఇటీవ‌లే హ‌స్తం గూటికి చేరిన కూచుకుళ్ల రాజేశ్ రెడ్డికి టికెట్ ఎలా కేటాయిస్తారంటూ మాజీ మంత్రి నాగం జ‌నార్ద‌న్ రెడ్డి ప్ర‌శ్నించారు. టికెట్ల‌ను రేవంత్ రెడ్డి అమ్ముకున్నాడంటూ ఆరోపించారు.

Kuruva Vijay Kumar Slams Revanth Reddy

తాజాగా గ‌ద్వాల‌లో కీల‌క‌మైన నాయ‌కుడిగా ఉన్న డాక్ట‌ర్ కురువ విజ‌య్ కుమార్ ను కాద‌ని ఇంకొక‌రికి టికెట్ కేటాయించ‌డం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. ఈ సంద‌ర్భంగా తెలంగాణ అమ‌ర వీరుల స్థూపం వ‌ద్ద ధ‌ర్నా చేప‌ట్టారు. రూ. 10 కోట్లు , 5 ఎక‌రాల భూమిని తీసుకుని గ‌ద్వాల టికెట్ ను రేవంత్ రెడ్డి(Revanth Reddy) అమ్ముకున్నాడంటూ ఆరోపించారు . నాడు ఓటుకు నోటు, నేడు సీటుకు నోటు అంటూ నినాదాలు చేశారు.

65 సీట్ల‌ను రూ. 600 కోట్ల‌కు అమ్ముకున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు డాక్ట‌ర్ కురువ విజ‌య్ కుమార్. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం క‌ష్ట‌ప‌డి ప‌ని చేసిన వారికి కాకుండా ఇత‌ర పార్టీల నుండి జంప్ అయిన వారికి టికెట్లు ఎలా ఇస్తారంటూ ప్ర‌శ్నించారు. రేవంత్ రెడ్డి వ‌ల్ల రాష్ట్రంలో పార్టీకి తీర‌ని న‌ష్టం వాటిల్లుతోందంటూ ఆరోపించారు. రేవంత్ రెడ్డి అక్ర‌మాల‌పై ఈడీ, ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ కు ఫిర్యాదు చేస్తామ‌న్నారు.

Also Read : Revanth Reddy : సీట్లు అమ్ముకుంటున్న రేవంత్

Leave A Reply

Your Email Id will not be published!