Laal Singh Chaddha : త‌గ్గేదే లేదంటున్న ‘లాల్ సింగ్ చ‌ద్దా’

ఏప్రిల్ 14న దేశ వ్యాప్తంగా విడుద‌ల

Laal Singh Chaddha : అద్వైద్ చంద‌న్ ద‌ర్శ‌క‌త్వంలో అమీర్ ఖాన్ , క‌రీనా క‌పూర్ , నాగ చైత‌న్య ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన లాల్ సింగ్ చ‌ద్దా విడుద‌ల తేదీ విష‌యంలో త‌గ్గేదే లేదంటున్నారు మూవీ మేక‌ర్స్.

ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏప్రిల్ 14న విడుద‌ల చేయాల‌ని ఇప్ప‌టికే డేట్ ఫిక్స్ చేశారు. అదే రోజు డైన‌మిక్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో కేజీఎఫ్ -2 మూవీ కూడా రిలీజ్ చేయాల‌ని డిసైడ్ అయ్యారు.

దీంతో రెండు సినిమాలు ఒకేసారి విడుద‌ల కావ‌డంతో ఎఫెక్టు ప‌డుతుంద‌ని దీంతో లాల్ సింగ్ చ‌ద్దా(Laal Singh Chaddha) మూవీ విడుద‌ల తేదీని వాయిదా వేస్తార‌న్న పుకార్లు షికార్లు చేశాయి. దీనిపై పూర్తి క్లారిటీ ఇచ్చింది లాల్ సింగ్ చ‌ద్దా చిత్ర యూనిట్.

ఇదిలా ఉండ‌గా ఈ మూవీని వ‌యా కామ్ స్టూడియోస్ , ఆమీర్ ఖాన్ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించింది. ఏప్రిల్ 14న రిలీజ్ చేయ‌నున్న‌ట్లు గ‌త ఏడాది 2021 న‌వంబ‌ర్లో చిత్ర బృందం ప్ర‌క‌టించింది.

ఇందులో ఎలాంటి మార్పు లేద‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేసింది. ఈ విష‌యాన్ని అధికారికంగా ధ్రువీక‌రించారు న‌టుడు అమీర్ ఖాన్. కాగా కేజీఎఫ్ చాప్ట‌ర్ -2 మూవీ సైతం ఏప్రిల్ 14న విడుద‌ల‌కు సిద్దం చేశారు ఆ చిత్ర బృందం.

అయితే 1994లో వ‌చ్చిన హాలీవుడ్ ఫిల్మ్ ది ఫారెస్ట్ గంప్ మూవీకి హిందీ రీమేక్ గా లాల్ సింగ్ చ‌ద్దా మూవీని తెర‌కెక్కించారు అద్వైద్ చంద‌న్.

అమీర్ ఖాన్ ప్రొడ‌క్ష‌న్స్ ఇవాళ సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌మ సినిమాను అనుకున్న తేదీనే రిలీజ్ చేస్తామ‌ని ఎట్టి ప‌రిస్థితుల్లో వాయిదా వేసే ప్ర‌స‌క్తి లేదంటూ స్ప‌ష్టం చేసింది.

Also Read : ప్రియాంక జోనాస్ ఖుష్ క‌బ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!