Lagadapati Rajagopal : లగడపాటి సర్వేలో గులాబీదే గెలుపు
రెండో స్థానానికే కాంగ్రెస్ పార్టీ పరిమితం
Lagadapati Rajagopal : హైదరాబాద్ – ఆంధ్రా ఆక్టోపస్ పొలిటికల్ లీడర్ గా పేరు పొందిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మరోసారి హాట్ టాపిక్ గా మారారు. ఆయన ప్రతి ఎన్నికల సమయంలో తనకంటూ ఓ స్వంతంగా సర్వే చేపడతారు. ఆ మేరకు అధికారికంగా ప్రకటిస్తారు.
Lagadapati Rajagopal Comment
కానీ ఆయన ఏది ప్రకటించినా ఆ పార్టీ పవర్ లోకి రాక పోవడం విశేషం. మంగళవారం లగడపాటి(Lagadapati Rajagopal) ప్రీ పోల్ సర్వే పేరుతో ముందుకు వచ్చారు. ఈ మేరకు తాను చేపట్టిన సర్వేలో అనూహ్యంగా సీఎం కేసీఆర్ సారథ్యంలోని భారత రాష్ట్ర సమితి తిరిగి తెలంగాణలో అధికారంలోకి రాబోతోందని జోష్యం చెప్పారు.
మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను బీఆర్ఎస్ పార్టీ అనూహ్యంగా హ్యాట్రిక్ కొట్ట బోతోందని తేల్చి పారేశారు. ఇందులో భాగంగా గులాబీ జెండా రెప రెప లాడడం ఖాయమని పేర్కొన్నారు లగడపాటి రాజగోపాల్.
బీఆర్ఎస్ కు 67 నుంచి 72 సీట్లు వస్తాయని తెలిపారు. ఇక కాంగ్రెస్ పార్టీకి 39 నుంచి 44 సీట్ల దాకా వచ్చే ఛాన్స్ ఉందని అభిప్రాయ పడ్డారు. ఇక భారతీయ జనతా పార్టీకి 4 నుంచి 6 స్థానాలు దాకా వచ్చే అవకాశం ఉందన్నారు. ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీకి పూర్తిగా 7 స్థానాలు కైవసం చేసుకుంటాయని , ఇతరులు 2 చోట్ల గెలుస్తారంటూ అంచనా వేశారు. ఇది ప్రాథమిక అంచనా మాత్రమేనని పోలింగ్ కంటే ముందు సరళి మారే అవకాశం లేక పోలేదన్నారు.
Also Read : Padi Kaushik reddy : గెలిపిస్తే జైత్ర యాత్ర లేదంటే శవయాత్ర