Ashish Mishra : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన యూపీలోని లఖింపూర్ ఖేరి ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా ఆదివారం కోర్టులో లొంగి పోయాడు.
ఘటన జరిగిన అనంతరం అతడిని నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేశారు అప్పట్లో. కాగా యూపీలో ఎన్నికలకంటే ముందు ఆశిష్ మిశ్రాకు(Ashish Mishra )అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
దీనిపై తీవ్ర దుమారం రేగింది. విపక్షాలతో పాటు రైతు సంఘం నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మనోడు దర్జాగా ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు.
దీనిని సవాల్ చేస్తూ బాధిత రైతు కుటుంబాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. తమకు న్యాయం చేయాలని కోరాయి. దీనిపై భారత సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం సంచలన తీర్పు చెప్పింది.
ఈ మేరకు కోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని తప్పు పట్టింది. అంతే కాదు నిందితుడి పట్ల ప్రభుత్వం ఎందుకు ప్రేమ కురిపిస్తోందోనని వ్యాఖ్యానించింది.
ఓ వైపు సుప్రీంకోర్టు నియమించిన సిట్ క్లియర్ గా నిందితుడి ప్రమేయం ఉన్నట్లు రిపోర్ట్ ఇచ్చింది. అతడికి బెయిల్ ఎలా ఇచ్చారంటూ నిలదీసింది. పనిలో పనిగా కీలక, సంచలన వ్యాఖ్యలు చేసింది.
అదేమిటంటే బాధితులకు వాయిస్ లేకుండా చేశారంటూ సీరియస్ అయ్యింది. వారం రోజుల్లో కోర్టులో లొంగి పోవాల్సిందేనంటూ, మంత్రి కుమారుడివైనంత మాత్రాన ఆశిష్ మిశ్రాకు మినహాయింపులు ఏమీ ఉండవని పేర్కొంది. దీంతో ఇవాళ ఆయన లొంగి పోయారు.
Also Read : ప్రతి రోజూ 20 వేల కోట్ల డిజిటల్ లావాదేవీలు