Lalan Singh Lalu : కావాలని లాలూపై సీబీఐ దాడులు
జనతాదళ్ యునైటెడ్ చీఫ్ లాలన్ సింగ్
Lalan Singh Lalu : ఆర్జేడీ చీఫ్, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ పై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దాడులు చేయడంపై తీవ్రంగా స్పందించారు జనతాదళ్ యునైటెడ్ చీఫ్ రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లాలన్ సింగ్(Lalan Singh Lalu) . ఇది కావాలని కేంద్రం చేస్తున్న కక్ష సాధింపు ధోరణి అని పేర్కొన్నారు. విపక్ష నేతలను చూసి బీజేపీ భయపడున్నందునే సీబీఐ కేసులు నమోదు చేయిస్తోందంటూ ఆరోపించారు. ప్యూర్ వెండెట్టాగా భావించాల్సి వస్తోందని హెచ్చరించారు. సాక్ష్యాధారాలు లేని కారణంగా సీబీఐ రెండు సార్లు కేసును మూసి వేసిందని లాలన్ సింగ్ స్పష్టం చేశారు.
జాబ్స్ స్కాం, భూ కుంభకోణంలో రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ , ఆయన కుటుంబంపై కేంద్రం కావాలని దాడికి దిగిందని మండిపడ్డారు. ఇటీవలే ఆయన కిడ్నీ పాడవడంతో సింగపూర్ లో శస్త్ర చికిత్స చేసుకుని బీహార్ కు వచ్చారు. అంతకు ముందు ఆయన కూతురు రోహిణి ఆచార్య కూడా సీరియస్ కామెంట్స్ చేసింది.
తన నాన్నకు ఏమైనా జరగరానిది జరిగితే మీరే బాధ్యులు అవుతారని తాను కోర్టుకు వెళతానంటూ హెచ్చరించింది. దీంతో సీబీఐ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. తాము దాడులు చేసేందుకు రాలేదని కేవలం వాంగ్మూలం తీసుకునేందుకు మాత్రమే వచ్చానని తెలిపింది. ప్రస్తుతం సీబీఐ దాడులపై భగ్గుమన్నారు జనతాదళ్ యునైటెడ్ చీఫ్ లాలన్ సింగ్(Lalan Singh).
ప్రస్తుత మోదీ సర్కార్ కేవలం ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయిస్తోందంటూ ధ్వజమెత్తారు లాలన్ సింగ్. బీహార్ లోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా ఇదే తరహా సోదాలకు దిగుతోందంటూ మండిపడ్డారు.
Also Read : అవయవ దానం ‘ఆమె’కు వందనం