Lalu Prasad Yadav Satire : న‌వ్వులు పూయించిన లాలూ

రాహుల్ త్వ‌ర‌గా పెళ్లి చేసుకో

Lalu Prasad Yadav Satire : ఆర్జేడీ చీఫ్‌, బీహార్ మాజీ సీఎం లాలూ ప్ర‌సాద్ యాద‌వ్(Lalu Prasad Yadav) గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఆయ‌న మాట్లాడే ప‌ద్ద‌తి డిఫ‌రెంట్ గా ఉంటుంది. అంతే కాదు సెటైర్లు వేయ‌డంలో , క‌వితాత్మ‌కంగా చెప్ప‌డంలో త‌న‌కు త‌నే సాటి. కేంద్ర మంత్రిగా ఉన్నా, సీఎంగా కొలువు తీరినా, ఎంపీగా పార్ల‌మెంట్ లో ప్రాతినిధ్యం వ‌హించినా లాలూ సెంట‌ర్ ఆఫ్ ది అట్రాక్ష‌న్ గా ఉన్నారు. ఇది ఆయ‌న ప్ర‌త్యేక‌త‌. లాలూను అనుస‌రించే వాళ్లు చాలా మంది ఉన్నారు.

సినీ రంగానికి చెందిన న‌టీ న‌టులు లాలూజీని ఎక్కువ‌గా ఇష్ట ప‌డ‌తారు. ఆయ‌న ఇటీవ‌ల తీవ్ర అనారోగ్యానికి గుర‌య్యారు. ఆపై కోలుకున్నారు. శుక్ర‌వారం అత్యంత కీల‌క‌మైన అఖిల‌ప‌క్షం స‌మావేశంలో ప్ర‌ధాన పాత్ర పోషించారు. రాజ‌కీయ ఉద్దండులుగా పేరు పొందిన నితీశ్ కుమార్ తో పాటు లాలూ ప్ర‌సాద్ ఉండ‌డం విశేష‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

దేశంలోని ప‌లు పార్టీల‌కు చెందిన నేత‌లంతా హాజ‌ర‌య్యారు. ఒక్కో నేత ఒక్కో రాష్ట్రాన్ని చూసుకోవాల‌ని ఈ సంద‌ర్బంగా నిర్ణ‌యించారు. ఇదే స‌మ‌యంలో ఒక్క‌సారిగా లాలూ ప్ర‌సాద్ ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్స్ చేశారు. ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ గురించి. త్వ‌ర‌గా పెళ్లి చేసుకో, మేము ఊరిగింపుగా వ‌స్తామ‌ని అన్నారు. దీంతో అక్క‌డ ఉన్న వారంతా న‌వ్వారు. ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం నెల‌కొంది. సోనియా గాందీ త‌న‌తో చాలా సార్లు చెప్పింద‌ని , రాహుల్ పెళ్లి చేసుకోవ‌డం లేద‌ని అని అన్నారు లాలూ ప్ర‌సాద్ యాద‌వ్.

Also Read : BCCI Test Squad : అజింక్యా ర‌హానేకు బంప‌ర్ ఛాన్స్

 

Leave A Reply

Your Email Id will not be published!