Lawrence Bishnoi Gang : రాకెట్ దాడి వెనుక ‘లారెన్స్’ గ్యాంగ్

అనుమానం వ్య‌క్తం చేసిన పంజాబ్ పోలీసులు

Lawrence Bishnoi Gang : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది పంజాబ్ పోలీసుల‌పై రాకెట్ దాడి ఘ‌ట‌న‌. తాజాగా న‌మ్మ‌లేని వాస్త‌వం వెలుగు చూసింది. ఈ ఏడాది మే9న మొహాలీ లోని పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్ట‌ర్స్ లో వీధి నుండి రాకెట్ తో న‌డిచే గ్రెనెడ్ ఉప‌యోగించారు.

తీవ్ర క‌ల‌కలం రేపింది. అద్దాలు పూర్తిగా ప‌గిలి పోయాయి. గోడ‌లు బీట‌లు వారాయి. అయితే ఈ ఘ‌ట‌న చోటు చేసుకునే కంటే ముందు సీసీటీవీలో పేరు మోసిన గ్యాంగ్ స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్ కి చెందిన స‌భ్యుడు దీప‌క్ , అత‌ని స‌హ‌చ‌రుడు ఉన్న‌ట్లు వెల్ల‌డైంది.

పంజాబ్ పోలీస్ భ‌వ‌న్ పై జ‌రిగిన దాడితో పాటు ప్ర‌ముఖ పంజాబీ సింగ‌ర్ సిద్దూ మూసే వాలా హ‌త్య వెనుక కూడా ప్ర‌ధాన సూత్ర‌ధారిగా గ్యాంగ్ స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్(Lawrence Bishnoi)  హ‌స్తం ఉన్న‌ట్లు తేల్చారు.

ఈ రెండు ఘ‌ట‌న‌ల్లో ఈ గ్యాంగ్ కు చెందిన ఈ ఇద్ద‌రు పాల్గొన్న‌ట్లు గుర్తించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజి సాయంతో పోలీసులు దాడికి పాల్ప‌డిన వారిపై నిఘా పెట్టారు.

ఆర్పీజీ దాడి కేసులో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కు చెందిన వ్య‌క్తి ప్ర‌ధాన నిందితుడ‌ని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. దీప‌క్ , అత‌డి స‌హ‌చ‌రుల‌తో క‌లిసి పోలీసు ప్ర‌ధాన కార్యాల‌యంపై ఆర్పీజీతో దాడి చేశారు.

న‌ల్ల‌టి ముఖానికి మాస్క్ ధ‌రించిన యువ‌కుడు అత‌డితో న‌డుస్తుండ‌గా దీప‌క్ ఫోన్ లో మాట్లాడుతున్నాడు. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ , ఖ‌లిస్తానీ ఉగ్ర‌వాదులు దేశంలో బిష్ణోయ్(Lawrence Bishnoi)  గ్యాంగ్ స్ట‌ర్ల‌ను ఉప‌యోగిస్తున్నారా అనే దానిపై ద‌ర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Also Read : టీఎంసీ ఎమ్మెల్యే కృష్ణ క‌ళ్యాణికి ఈడీ షాక్

Leave A Reply

Your Email Id will not be published!